ప్రాణం పోయినా ఆ హీరోల దగ్గరకి వెళ్ళను...దాసరి నారాయణరావు
నా ప్రాణం పోయినా ఏ హీరోను కలసి నేను మీతో సినిమా చేస్తాను..అని కథ పట్టుకుని వెళ్ళి అడగను. నాతో మీరు సినిమా చేయండి అని అడిగిన వారితోనే నా కెరీర్ కొనసాగిస్తాను..నా దృష్టిలో ఇప్పటికీ దర్శకుడే హీరో అని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు. రీసెంట్ గా సంక్రాంతికి బాలకృష్ణతో పరమవీర చక్ర చిత్రం రూపొందించిన దాసరి నారాయణరావు ఆ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాను కలిసారు. మీరు తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో చేసి..మూడవ తరంతో చేసానన్నది కంటిన్యూ చేస్తారా అన్న ప్రశ్నకి ఆయన అలా స్పందించారు. అలాగే పరమవీర చక్ర చిత్రం తాము ఊహించని దానికన్నా ఎక్కువ విజయం సాధించిందని, అందరూ అందులోని బాలకృష్ణతో చేసిన రావణా బ్రహ్మ గెటప్ చూసి,సీతారామ కళ్యాణం చిత్రం మళ్ళీ ఎందుకు చేయకూడదంటున్నారని అన్నారు. అలాగే తన తదుపరి చిత్రం సంచలనాత్మకంగా ఉంటుందని,త్వరలోనే ఆ వివరాలు విడుదల చేస్తామన్నారు.


Click it and Unblock the Notifications











