'కళ్యాణ్ రామ్ కత్తి' టైటిల్ నేనే ఇప్పించానంటన్న దాసరి
కళ్యాణ్ రామ్ కథ విన్నాక కృషి చేసి 'కత్తి' టైటిల్ ఇప్పించాను అంటూ దాసరి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగామారాయి. కళ్యాణ్ రామ్ తాజా చిత్రం.'కళ్యాణ్ రామ్ కత్తి' విషయమై గుణశేఖర్ కూ, కల్యాణ్ రామ్ కూ మధ్య పెద్ద వివాదమే జరిగింది. చివరకు గుణశేఖర్ ఏం చేయాలో అర్ధం కాని స్ధితిలో ఆ టైటిల్ ని వదిలేసుకుంటున్నట్లు ఆవేదనతో ప్రకటించారు. అయితే తాజాగా దాసరి సీన్ లోకి వచ్చి తానే కత్తి టైటిల్ ని కళ్యాణ్ రామ్ కి ఇప్పించినట్లు చెప్పారు. ఈ చిత్రం ఆడియో ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. దాసరి చేతుల మీదుగా కల్యాణ్‌రామ్ ప్లాటినమ్ డిస్కును అందుకున్నారు.
ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ "కల్యాణ్‌రామ్ మంచి నిర్మాత. అన్ని రంగాల్లోనూ అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అతని కథ విన్నాక కృషి చేసి 'కత్తి' టైటిల్ ఇప్పించాను. మంచి కథ, మంచి నిర్మాత, మంచి దర్శకుడు కలిస్తే మంచి సినిమా వస్తుంది. 'కల్యాణ్ రామ్ కత్తి' అలాంటి మంచి సినిమానే. ఇటీవల పరిశ్రమలో అరేంజర్స్, కాంబినేషన్ ఫిక్సర్స్ ఎక్కువై పోయి పరిశ్రమను తప్పుదోవ పట్టిస్తున్నారు. 'పరమవీరచక్ర' ప్రేక్షకుల అంచనాలకు చేరుకుంటుంది'' అని చెప్పారు. యన్.టి.ఆర్. ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'కత్తి'. మల్లికార్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సనాఖాన్ నాయిక. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.


Click it and Unblock the Notifications











