అల్లు పై దాసరి విల్లు

దాసరి నివాసానికి వెళ్లిన రవి పార్టీలో మళ్లీ చురుకైన పాత్ర పోషించాలని, ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వచ్చేది కాంగ్రెస్ యుగమని, ఇప్పుడు చురుకుగా పనిచేసి త్వరలో జరిగే విజయోత్సవ సభలో ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధంకావాలని రవి చెప్పినట్టు తెలిసింది. తనకు ఆరోగ్యం సరిగా లేనందు వల్లనే పారప్టీ ప్రచారంలో పాల్గొన లేకపోతున్నానని దాసరి చెప్పారని తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల తరఫున ప్రచార కార్యక్రమం చేపడతానని ఆయన హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
అలాగే రవితో మాటల్లో మేస్త్రి సినిమా గురించి దాసరి వివరించారని సమాచారం. అలాగే పీఆర్పీలో తలెత్తిన తాజా పరిణామాలు,డబ్బుకు సంబంధించి ఆ పార్టీలో వెల్లువెత్తిన ఆరోపణలు వీరిద్దరి మధ్యా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే పీఆర్పీ నుంచి బయిటకు వచ్చిన అభిమానులు దాసరి వద్దకు చేరుకుని, అరవింద్ కి వ్యతిరేకంగా ప్చరారం చేయటానికి సంసిద్దులవుతున్నారు. వీరి సూచన మేరకే తొలిసభకు దాసరి అనకాపల్లిని వేదికగా ఎంచుకున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











