రీమేక్ తో దాసరి రీ ఎంట్రీ

దాంతో దాసరి ఆ చిత్రం రైట్స్ తీసుకుని తమ సొంత బ్యానర్ పై నిర్మిస్తూ దర్శకత్వం చేస్తున్నారు. అంతేగాక రాజ్ కిరణ్ వేసిన తండ్రి పాత్రని ఆయనే చెయ్యబోతున్నారు. గతంలోనూ 'మామగారు, సూరిగాడు' వంటి చిత్రాలలో ఇటువంటి మథ్యతరగతి పెద్దాయన పాత్రలు చేసిండటంతో ఆయనకి ఇలాంటి పాత్రలు కొట్టన పిండి. నిజానికి చాలా కాలం క్రిందట రిలీజైన 'తవమాయి తవమాయి' సినిమా రీమేక్ రైట్స్ కోసం చాలా మంది ట్రై చేసారు. కాని చేరన్ స్క్రిప్టు ఒక్క అక్షరం కూడా మార్చకూడదని కండీషన్ పెట్టడంతో ఎవరికీ ధైర్యం చేయలేదు. ఇప్పుడా అదృష్టం దాసరికి దక్కింది. కాబట్టి మరో బంగారు కుటుంబం లాంటి సినిమా దాసరి నుంచి రాబోతోందన్నమాట.


Click it and Unblock the Notifications











