దాసరి మరో ఫెమినిస్టు సినిమా!
మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే రెండు సినిమాలు త్వరలో తెలుగులో ప్రారంభం కానున్నాయి. గతంలో ఇటువంటి అనేక సినిమాలకు దర్శకత్వం వహించిన ఇప్పటి కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు ఈ తరహా సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా పేరు ఆదివారం ఆడవాళ్ళకు సెలవు. టైటిల్ చాలా వెరైటీగా ఉంది కదూ. ఈ సినిమాలో అర్చన (పాత పేరు వేద), సుహాసిని తల్లీకూతుళ్ళుగా నటించనున్నారు. గతంలో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి వంటి విజయవంతమైన సినిమాకు దర్శకత్వం వహించిన రాజా వెన్నంరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇలా ఉండగా దాసరి నారాయణ రావు తేజ దర్శకత్వంలో ప్రస్తుతం నిర్మిస్తున్న చిత్రం ఒక విచిత్రం సినిమాలో అశ్లీల దృశ్యాలు పుష్కలంగా ఉన్నాయని, ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి ఇటువంటి సినిమాను తీయకూడదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ సినిమాను మహిళ అయిన దాసరి పద్మ సమర్పించడం మరిన్ని విమర్శలకు దారి తీస్తోంది.


Click it and Unblock the Notifications