రామోజీ ఆయనతో రాజీ పడ్డారా?

అలాగే ఈనాడు లోకూడా ఎక్కడా దాసరి గురించి న్యూస్ వచ్చేది కాదు. పొరపాటున్న ఎప్పుడన్నా వస్తే ఆ పొరపాటుకు ఆ న్యూస్ తెచ్చిన వారు మూల్యం చెల్లించాల్సిందే. అలాగే దాసరి కూడా ఉదంయం పేపరు పెట్టి రామోజీకి పోటీ ఇద్దామని చూసారు. అయితే అనుకున్నంతగా వర్కవుట్ కాలేదు. ఇలా ఇన్నాళ్ళూ నడిచిన వీళ్ళద్దరి కోల్డ్ వార్ హఠాత్తుగా ముగిసిందా అనే సందేహం అందరికీ వస్తోంది. లేదా పేరున్న వాళ్ళ సీరియల్స్ కావాలి కాబట్టే దాసరి సీరియల్ ఏక్సెప్ట్ చేసారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏదైమైనా వీళ్ళిద్దరూ కలవటం వెనక ఏ ఉద్దేశం ఉన్నా ప్రజలుకు అందే ఫలితం మాత్రం చాలా భారీగానే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











