వైఎస్సే టార్గెట్టా : దాసరి ‘వడ్డి కాసులవాడు’ ఫస్ట్‌లుక్
హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారాయణరావు తన 151వ సినిమాగా 'వడ్డి కాసులవాడు' అనే చిత్రానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఇందులో లీడ్ రోల్ పోషిస్తున్నారు దాసరి. ఇందులో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే ప్యూన్ పాత్రలో కనిపించనున్నారు.
శనివారం దాసరి జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్రాన్ని ప్రారంభించారు. తొలి సన్నివేశం దాసరిపై చిత్రీకరించారు. అదే విధంగా రోజు ఈచిత్రం ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈచిత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ అవినీతి ప్రస్పుటించేలా ఉంటుందని, దాసరి నారాయణరావు వైఎస్ఆర్ వ్యక్తిగత అనుచరుడు సూరీడు రోల్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.
గతంలో దాసరి నారాయణరావు చిరంజీవిపై సెటైర్‌గా 'మేస్త్రి' అనే చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసింతే. తాజాగా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దాసరి 'వడ్డి కాసులవాడు' చిత్రాన్ని రూపొందిస్తుండం సర్వత్రా చర్చనీయాంశం అయింది. 2014 ఎన్నికల నాటికి సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.
దీంతో పాటు ఓ మూడు సినిమాలను తన సొంత బ్యానర్‌పై నిర్మించబోతున్నట్లు దాసరి తెలిపారు. ఈ చిత్రంలో ఒకదానికి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించనుండగా, మరో చిత్రానికి సురేష్ కృష్ణ, మూడో చిత్రం ద్వారా కోడైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేసిన రవి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
వీటి తర్వాత మంచు విష్ణు హీరోగా మరో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు దాసరి. ఈచిత్రాన్ని మోహన్ బాబు, రమేష్ వడ్డె సంయుక్తంగా నిర్మించనున్నారు. వీటి తర్వాత ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు దాసరి తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











