వారెవా.. టీజర్‌కు ముందే హీట్ పెంచేసిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్ రాజసం చూశారా!
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని ఖుషి చేసేందుకు సిద్ధం అయ్యాడు. అరవింద సమేత చిత్ర టీజర్ విడుదలకు ముహూర్తం కుదిరింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రంపై అంచనాలు ఏస్థాయిలో ఉన్నాయో ఉత్కంఠ కూడా అదే విధంగా ఉంది. ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అజ్ఞాతవాసి పరాజయం తరువాత త్రివిక్రమ్ దర్శత్వంలో వస్తున్న చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ దుమ్మురేపింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ అంతా టీజర్ కోసం చూస్తున్నారు.

ముహూర్తం కుదిరింది
అరవింద సమేత టీజర్ ఆగష్టు 15 న స్వాతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేయనున్నారు. తాజగా టీజర్ విడుదల సమయాన్ని ప్రకటించారు. ఆగష్టు 15 న ఉదయం 9 గంటలకు టీజర్ విడుదుల కానుంది.

అదిరిపోయింది
టీజర్ సమయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ పోస్టర్ విడుదుల చేసింది. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ పోజు అదిరిపోయింది. కేవలం షాడో తో మాత్రమే ఈ పోస్టర్ ని డిజైన్ చేశారు. అయినా కూడా ఎన్టీఆర్ కుర్చీలో కాలుమీద కాలేసుకుని రాజసంగా ఉన్నాడు. టీజర్ కు ముందే ఈ పోస్టర్ హీట్ పెంచేలా ఉంది.

బలమైన యాక్షన్
అరవింద సమేత చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ఎంత బలంగా ఉంటాయో ఈ పోస్టర్ బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ కుర్చీలో కూర్చుని ఉండగా అతడి కింద విలన్ గ్యాంగ్ లోని వ్యక్తి నిస్తేజంగా పడి ఉన్నాడు.

ఫ్యాక్షన్ నేపథ్యంలో
ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎన్టీఆర్ గతంలో ఆది వంటి చిత్రాల్లో నటించాడు. త్రివిక్రమ్ శైలిలో అరవింద సమేత ఎలా ఉండబోతోందో దసరా వరకు వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











