twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంజయ్ దత్... మీ కూతురు ప్రేమ వ్యవహారం గురించి మీకు తెలుసా?

    |

    సినిమాల్లో అడుగు పెట్టకుండానే కేవలం సోషల్ మీడియా ద్వారా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న స్టార్ కిడ్స్‌లో సంజయ్ దత్ కూతురు త్రిషాలా దత్ టాప్ లిస్టులో ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన సిజ్లింగ్ ఫోటోలను షేర్ చేసే త్రిషాలాకు ఫాలోయింగ్ ఎక్కువే.

    ఆమెను ఫాలో అయ్యేవారు మీరు ఎవరితో డేటింగ్ చేస్తున్నారు? ఎవరినైనా ప్రేమించారా? అనే ప్రశ్నలతో తరచూ విసిగిస్తున్నారట. ఇప్పటి వరకు తన లవ్ లైఫ్ గురించి బయటకు చెప్పని త్రిషాలా..తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ హింట్ ఇచ్చారు.

    ఇటాలియన్ అబ్బాయితో డేటింగ్ అంటే..

    త్రిషాలా తాజాగా ఓ రెస్టారెంటులో పాస్తా, వైన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ ద్వారా ఆమె తాను ఒక అబ్బాయితో డేటింగ్ చేస్తున్నాను అనే సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ‘ఇటాలియన్ అబ్బాయితో డేటింగ్ అంటే కావాల్సినంత పాస్తా, వైన్' అని వ్యాఖ్యానించారు.

    మీ బాయ్ ఫ్రెండుతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేయండి

    మీ బాయ్ ఫ్రెండుతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేయండి

    త్రిషాలా దత్ ఈ పోస్ట్ పెట్టగానే... మీ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేయాలని కోరుతూ ఫ్యాన్స్ కామెంట్లు పెట్టారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి ‘త్రిషాలా లాంటి గర్ల్ ఫ్రెండ్ దొరికిన ఆ కుర్రోడు చాలా అదృష్ట వంతుడు' అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటాలియన్ అబ్బాయి కంటే ఇండియన్ అబ్బాయి అయితే లవ్, కేరింగ్ ఎక్కువగా ఉంటుందని మరికొందరు సూచించడం గమనార్హం.

    సంజయ్ దత్ గారు.. మీ కూతురు ఏం చేస్తుందో చూస్తున్నారా?

    సంజయ్ దత్ గారు.. మీ కూతురు ఏం చేస్తుందో చూస్తున్నారా?

    సంజయ్ దత్ గారు... మీరు చూస్తున్నారా త్రిషాలా ఏం చేస్తోందో? అంటూ ఆయన్ను ట్యాగ్ చేస్తూ కొందరు కామెంట్లు చేయడం గమనార్హం. సంజయ్ దత్ అభిమానులు చాలా మంది నీ ప్రియుడితో సంతోషంగా గడుపు అంటూ ఆమెను బ్లెస్ చేస్తున్నారు.

    కూతురు డేటింగ్ లైఫ్ విషయంలో సంజయ్ దత్

    కూతురు డేటింగ్ లైఫ్ విషయంలో సంజయ్ దత్

    తన కూతురు డేటింగ్ లైఫ్ విషయంలో సంజయ్ దత్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదట. త్రిషాలా కొత్త రిలేషన్‌షిప్ విషయంలో అతడి నుంచి అంగీకారం లభించిందట. ఆ తర్వాతే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని అఫీషియల్‌గా వెల్లడించినట్లు తెలుస్తోంది.

    అప్పటి నుంచి తండ్రికి దూరంగానే

    అప్పటి నుంచి తండ్రికి దూరంగానే

    1996లో తన తల్లి బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించిన తర్వాత త్రిషాలా దత్ తన ఆంటీ ఎన్నా శర్మ, గ్రాండ్ పారెంట్స్‌తో కలిసి అమెరికాలో ఉంటున్న సంగతి తెలిసిందే. న్యూయార్కులో ఆమె స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. సంజయ్ దత్ ప్రొడక్షన్స్‌కు ఆమె సీఈఓగా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు న్యూయార్కులో డ్రీమ్ ట్రెసెస్ హెయిర్ ఎక్స్‌టెన్షన్ అనే సంస్థను కూడా స్థాపించారు.

    English summary
    Sanjay Dutt's daughter Trishala recently posted a photo on Instagram wherein she was seen enjoying some pasta at a restaurant which she combined it with a glass of wine. While sharing the picture, Trishala was seen boasting about the perks of dating an Italian guy in the caption. "dating an Italian boy means lots of pasta and lots of wine," she wrote on Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X