Don't Miss!
- News సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జులై 13న అజిత్ ‘డేవిడ్ బిల్లా’
ఈ సందర్భంగా ఎస్.వి.ఆర్ మీడియా అధినేత్రి శోభారాణి మాట్లాడుతూ...'అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'డేవిడ్ బిల్లా' చిత్రాన్ని జులై 13న ప్రపంచ వ్యాప్తంగా 1200 థియేటర్లలో తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతోంది. యువన్ శంకర్ రాజా సారథ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయింది. హైటెక్నిక్ వేల్యూస్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం అజిత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది' అన్నారు.
అజిత్ సరసన పార్వతి ఒమనకుట్టన్ కథానాయికగా నటించిన ఈచిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను మీనాక్షి దీక్షిత్ పోషించారు. ప్రభు, బృనా అబ్దుల్లా, రెహమాన్, సుదాషు పాండే, శ్రీమాన్, శ్రీచరణ్, కృష్ణ కుమార్, మనోజ్ కె. జైన్ తదితరులు ఇందులో ముఖ్యపాత్రల్ని పోషించారు. చక్రి తోలేటి, ఎరిక్ సెల్ బర్గ్‌లు కథను సమకూర్చిన దీనికి శరత్ మాండవ, జాఫర్ అహ్మద్, ఇఆర్ మురుగన్‌లు సంయుక్తంగా స్క్రీన్ ప్లేని వ్రాశారు.
సంగీతం: యువన్ శంకర్ రాజా, పాటలు: అనంత శ్రీరామ్, ఛాయా గ్రహణం: ఆర్ .డి. రాజశేఖర్, కళ: సెల్వకుమార్, ఎడిటింగ్: సురేష్ ఆర్స్, ఫైట్స్: జైకా స్టంట్ టీమ్(కెచ కంప్యాడ్), నిర్మాత: శ్రీమతి శోభారాణి, దర్శకత్వం: చక్రి తోలేటి.