Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
లేబర్‌గా పుట్టినోడు డాన్‌గా...(‘డేవిడ్ బిల్లా’ ఆడియో విశేషాలు)
అజిత్, పార్వతి ఓమనకుట్టన్, బ్రుణ అబ్దుల్లా ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం “డేవిడ్ బిల్లా". ఈ చిత్రాన్ని తెలుగులో శోభా రాణి ఎస్విఆర్ మీడియా ప్రై.లి బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో సోమవారం తాజ్ డెక్కన్, హైదరాబాద్ లో విడుదల అయ్యింది. డి.రామానాయుడు, రమేష్ ప్రసాద్, బెల్లం కొండ సురేష్, ఆర్పీ పట్నాయక్, చిన్ని కృష్ణ, సముద్ర, ప్రసన్న కుమార్,అచ్చి రెడ్డి మరియు రమేష్ పుప్పళ్ళ అతిధులుగా విచ్చేశారు వీరితో పాటు పార్వతి ఓమనకుట్టన్, మరియు ఈ చిత్రానికి రచనా సహకారం అందించిన శరత్ మహాదేవ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ చిత్ర ఆడియోని ఆవిష్కరించిన రామానాయుడు మాట్లాడుతూ....ట్రైలర్స్, పాటలు అద్భుతంగా ఉన్నాయి. చాలా ప్రెస్టీజియస్ గా రూపొందించిన ఈచిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. నిర్మాత బెల్లంకొండ మాట్లాడుతూ అసలు ఈచిత్రం హక్కులు నేనే పొందాలి...కానీ శోభారాణి గారు సినిమా తీసుకుంటున్నారని తెలిసి పక్కకు తప్పుకున్నాను, తెలుగు పరిశ్రమకు విజయనిర్మల గొప్ప దర్శకురాలైతే...శోభారాణి గొప్ప మహళా నిర్మాత అని చెప్పారు.
నిర్మాత శోభారాణి మాట్లాడుతూ...దశావతారం తరువాత మా బ్యానర్లో పెద్ద క్రేజ్ ఉన్న సినిమా 'డేవిడ్ బిల్లా'నే. ఈ చిత్రానికి బిజినెస్ కూడా బాగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఒక సంవత్సరం పాటు చక్రి తోలేటి ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డారు. లేబర్‌గా పుట్టిన డేవిడ్...డాన్‌గా ఎలా మారాడన్నదే కథ. అజిత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పైట్స్ చాలా నాచురల్‌గా చేశాడు.
ఈచిత్రానికి శేఖర్ రాజా ఫోటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. యువన్ శంకర్ రాజా ట్రెమండస్ మ్యూజిక్‌ను అందించారు. పెద్ద టెక్నీషియన్స్ అంతా ఈ సినిమాకి పని చేయడం సినిమా బాగా రావడానికి కారణం అయిందని నిర్మాత చెప్పారు. “డేవిడ్ బిల్లా" తమిళ “బిల్లా" చిత్రానికి ప్రీక్వెల్ బిల్లా పాత్ర ఎక్కడ మొదలయ్యింది అనేది కథాంశం. యువన్ శనకర్ రాజ సంగీతం అందించిన ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.