ఆచార్య లుక్కులో డేవిడ్ వార్నర్.. మెగా హీరో డైలాగ్ తో అదరగొట్టేసాడు
ఇండియన్ క్రికెటర్ కాకపోయినా కూడా డేవిడ్ వార్నర్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే అతన్ని ఒక స్టార్ హీరో రేంజ్ లో లైక్ చేస్తున్నారు. హైదరాబాద్ సన్ రైజర్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ మొదటి నుంచి కూడా తెలుగు ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్లుగా వీడియోలను వదులుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటివల ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ మరొక సరికొత్త వీడియోతో మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు ఇచ్చాడు.
డేవిడ్ వార్నర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో చాలా వైరల్ అవుతోంది. నెవర్ బిఫోర్ అనేలా మెగాస్టార్ చిరంజీవి లుక్కుతో కొత్త షాక్ ఇచ్చాడు. ఆచార్య సినిమాలో చిరు ఎలాగైతే కనిపించబోతున్నారో అలానే తన ఫేస్ ను ఎడిట్ చేసి వీడియోను విడుదల చేశాడు. ఇటీవల ఆచార్య టీజర్ ను వదిలిన విషయం తెలిసిందే. అదే టీజర్ తో వార్నర్ మ్యాజిక్ క్రియేట్ చేశాడు. గతంలోనే డేవిడ్ వార్నర్ విభిన్న రకాలుగా మహేష్ స్టైల్ ను ఫాలో అయ్యాడు.

బాహుబలి డైలాగ్ తో కూడా ఆదరోగ్గొట్టిన విషయం తెలిసిందే. ఇక ఆచార్య లుక్ మాత్రం అదిరిపోయింది అంటున్నారు. స్మైల్, యాక్షన్, డైలాగ్స్ చెప్పడం ఇలా అన్ని విషయాల్లో డేవిడ్ ఆచార్య అదిరిపోయాడని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా వార్నర్ కిర్రాక్ అనే ట్యాగ్స్ అయితే ఎక్కువగా అందుతున్నాయి. చూస్తుంటే భవిష్యత్తులో ఈ స్టార్ క్రికెటర్ హీరో అయినా అయిపోవచ్చని అంటున్నారు. బాహుబలి డైలాగ్ తో పాటు బుట్టబొమ్మ డ్యాన్స్ తో కూడా వార్నర్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆచార్య లుక్ కూడా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











