Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఏదో నా వంతుగా ట్రై చేశాను.. బన్నీ ట్వీట్‌కు వార్నర్ రిప్లై
క్రికెటర్ డేవిడ్ వార్నర్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య సంభాషణ తెగ వైరల్ అవుతోంది. టిక్ టాక్‌లో ఎంట్రీ ఇచ్చిన ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఓ ఊపు ఊపేస్తున్నాడు. ఈ క్రమంలో డైలాగ్స్, పాటలకు రెచ్చిపోయి వీడియోలు చేసేస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్యతో కలిసి చేసిన బుట్టబొమ్మ ఓ రేంజ్లో హల్చల్ చేసింది. ఆ వీడియో దేశవిదేశాల్లో వైరల్ అయింది. దేశం మొత్తం తిరిగి చూసిన ఆ వీడియోను బన్నీ మెచ్చుకున్నాడు. బన్నీ ప్రశంసలకు డేవిడ్ కూడా తబ్బిబ్బైపోయాడు.
బుట్టబొమ్మ స్టెప్పులను మరిచిపోయే లోపే మరో టిక్ టాక్‌తో సోషల్ మీడియాను ఊపేస్తున్నాడు. అల వైకుంఠపురములోని రాములో రాముల పాటకు ఫ్యామిలీతో కలిసి స్టెప్పులు వేశాడు. దోశ స్టెప్పులను వార్నర్ తన భార్యతో కలిసి వేశాడు. ఈ వీడియోలు ప్రస్తుతం అంతటా వైరల్ అవుతున్నాయి. రాములో రాముల హాఫ్ కోట్ స్టెప్పులు ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్నారి అర్హ కూడా క్యూట్ క్యూట్‌గా దోశ స్టెప్పులు వేసిన వీడియోలు తెగ హల్చల్ చేశాయి.
రాములో రాముల టిక్ టాక్‌పై బన్నీ స్పందిస్తూ.. మరోసారి చంపేశావ్ వార్నర్, మరో అతిపెద్ద సర్ప్రైజ్ ఇచ్చావ్.. మరోసారి ధన్యవాదాలు సర్ అని పేర్కొన్నాడు. బన్నీ ట్వీట్‌కు స్పందించిన వార్నర్.. 'ఏదో నా వంతుగా ప్రయత్నించాను.. నాకు ఆ పాట, ఆ డ్యాన్సులంటే చాలా ఇష్టమ'ని తెలిపాడు. ఇక వీరిద్దరి ట్వీట్ల సంభాషణ ప్రస్తుతం దుమ్ములేపుతోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. బన్నీ పుట్టిన రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.