బుట్టబొమ్మ ఫీవర్ మామూలుగా లేదే.. క్రికెటర్ వీడియో వైరల్
అల వైకుంఠపురములో చిత్రం ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో.. బుట్టబొమ్మ సాంగ్ అంతకు మించి సంచలనాలు నమోదు చేసింది. టిక్ టాక్‌లో బుట్టబొమ్మ ఫీవర్ ఎలా ఉందో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ఇప్పటికే కొన్ని వందల కోట్ల వీడియోలు టిక్ టాక్‌లో ట్రెండ్ అవుతున్నాయి. బన్నీ, పూజా హెగ్డే స్టెప్పులు ప్రస్తుతం ఖండాలు కూడా దాటేసింది.
ప్రస్తుతం కరోనా కాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్‌ను విధించారు. ఇక అందరూ ఇంటి పట్టునే ఉండటంతో కొంతమంది స్మార్ట్ ఫోన్‌లకే అతుక్కుపోయారు. అలాగే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ లాక్ డౌన్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య పిల్లలతో కలిసి టిక్ టాక్‌లో దుమ్ములేపుతున్నాడు. తాజాగా టిక్ టాక్ సెన్సేషన్ బుట్టబొమ్మ పాటకు స్టెప్పులు వేశాడు.
View this post on InstagramIt’s tiktok time #buttabomma get out of your comfort zone people lol @candywarner1
A post shared by David Warner (@davidwarner31) on

ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి అల్లు అర్జున్ వేసిన సిగ్నేచర్ స్టెప్‌ను వేశారు. మధ్య మధ్యలో బుడ్డోడు వచ్చి పోవడం మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ఇప్పటికే బుట్టబొమ్మ పాటకు 500 మిలియన్లకు పైగా స్టెప్పులేసినట్టు టిక్ టాక్ లెక్కలు చెబుతున్నాయి. ఇంత వరకు దేశ వ్యాప్తంగానే ఉన్న బుట్టబొమ్మ ఫీవర్.. వార్నర్ దెబ్బకు ఖండాంతరాలు దాటేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











