అప్పుడు బుట్టబొమ్మ, ఇప్పుడు రాములో రాముల.. దుమ్ములేపుతున్న డేవిడ్
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్‌ను పాటిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. దీంతో కొంతమంది సెలెబ్రిటీలు సోషల్ మీడియాను షేక్ చేస్తేస్తున్నారు. వారికున్న కొత్త కొత్త టాలెంట్‌లను బయట పెడుతున్నారు. అందులో అందరి కంటే ముందు వరుసలో ఉంటాడు క్రికెటర్ డేవిడ్ వార్నర్.
అల వైకుంఠపురములో పాటల గురించి, అవి క్రియేట్ చేసిన రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బుట్టబొమ్మ పాట ఏకంగా ఖండాంతరాలు దాటి పోయింది. టిక్ టాక్‌లో కొన్ని కోట్ల మంది బుట్టబొమ్మను ఫాలో అయ్యారు. బన్నీ స్టెప్పులను అనుకరిస్తూ.. సెలెబ్రిటీలు సైతం వీడియోలు చేశారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి అల్లు అర్జున్ వేసిన సిగ్నేచర్ స్టెప్‌ను వేశారు. మధ్య మధ్యలో బుడ్డోడు వచ్చి పోవడం మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.

ఇది మరిచిపోయే లోపే మరో టిక్ టాక్‌తో సోషల్ మీడియాను ఊపేస్తున్నాడు. అల వైకుంఠపురములోని రాములో రాముల పాటకు ఫ్యామిలీతో కలిసి స్టెప్పులు వేశాడు. దోశ స్టెప్పులను వార్నర్ తన భార్యతో కలిసి వేశాడు. ఈ వీడియోలు ప్రస్తుతం అంతటా వైరల్ అవుతున్నాయి. రాములో రాముల హాఫ్ కోట్ స్టెప్పులు ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్నారి అర్హ కూడా క్యూట్ క్యూట్‌గా దోశ స్టెప్పులు వేసిన వీడియోలు తెగ హల్చల్ చేశాయి.


Click it and Unblock the Notifications











