twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాక్ అయ్యారు: అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఫ్యామిలీతో శ్రద్దా కపూర్... అసలేం జరిగింది?

    దావూద్ సోదరి హసీనా పార్కర్‌‌పై చిత్రాన్ని తెరకెక్కించనుంది బాలీవుడ్‌. ఈ విషయం లో మాట్లాడేందుకు హసీన బందువులు ఆ సినిమా సెట్స్ మీదకే వచ్చారు, శ్రద్దా దాస్ తో మాట్లాడారు.

    |

    అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'హసీనా'. ఈ చిత్రంలో హసీనా పాత్రను బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ పోషిస్తోంది. 'ఆషికీ2' సినిమా తర్వాత శ్రద్ధాకపూర్‌కి బాలీవుడ్‌లో మరింత మంచి గుర్తింపు లభించింది. తాజాగా నటించిన 'బాఘీ' చిత్రం కూడా విశేష ప్రేక్షకాదరణ పొందింది. దీంతో శ్రద్ధాకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ బయోపిక్‌లో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ముంబై అండర్‌వరల్డ్ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం చెల్లెలు హసీనా పార్కర్‌ జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు దర్శకుడు అపూర్వ లఖియా సన్నాహాలు చేస్తున్నారు.

    హసీనా పార్కర్‌ పాత్ర కోసం తొలుత ఆయన సోనాక్షి సిన్హాను ఎంపిక చేశారు. డేట్లు సర్దుబాటు చేయలేని కారణంగా సోనాక్షి సిన్హా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో చివరిగా శ్రద్ధాని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ..ఈ చిత్రం షూటింగ్ ముంబయిలోని మెహబూబ్ స్టూడియోస్ లో జరుగుతోంది. రెండు రోజుల క్రితం 'హసీనా' సెట్స్ లో శ్రద్ధాకపూర్ ను దావూద్ కుటుంబ సభ్యులు కలిసినట్లు సమాచారం. దావూద్ సోదరి హసీనా పార్కర్ పిల్లలు అలీషా, ఉమరియా, ఖుషియా తో పాటు ఆమె సోదరుడు వరుస అయ్యే బందువు సమీర్ అంతులే అక్కడికి వెళ్లారు.

     రంగుల ప్రపంచం:

    రంగుల ప్రపంచం:


    సినిమా రంగం.... పైకి ఎంతో కలర్ ఫుల్‌గా కనిపించే ఒక రంగుల ప్రపంచం. కొందరు నటనపై మక్కువతో ఈ రంగం వైపు వస్తే...మరికొందరు డబ్బు సంపాదనే ధ్యేయంగా ఇటువైపు అడుగులు వేస్తుంటారు. ఇక్కడ ఒక్కసారి జల్సా జీవితానికి అలవాటు పడ్డాక పాత జీవితంలోకి వెళ్లడానికి మనసు ఒప్పదు.

    తప్పుడు దారుల్లో:

    తప్పుడు దారుల్లో:

    ఒక్కోసారి పరిస్థితులు తలక్రిందులైన సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. ఒక్కోసారి చేతిలో చిల్లిగవ్వకూడా లేని పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో కొందరు స్టార్స్ తప్పుడు దారుల్లో ప్రయాణిస్తున్నారు. వ్యభిచారం, డ్రగ్స్, నేరస్తులతో చేతులు కలపడం, లేదా వారితో సంబంధాలు పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు.
    మాఫియా డాన్లతో:

    మాఫియా డాన్లతో:

    ముంబై కేంద్రంగా నడిచే బాలీవుడ్ పరిశ్రమలో కొందరు అవకాశాలు లేని హీరోయిన్లు ముంబై డాన్లతో స్నేహం చేసి.... వారి అండతో అవకాశాలు తక్కించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయనే వాదన ఉంది. కొందరు హీరోయిన్లయితే ఏకంగా మాఫియా డాన్లతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, వారిని పెళ్లి చేసుకోవడం లాంటివి కూడా చేసారు. అయితే ఇప్పుడు ఒక లేడీ డాన్ జీవిత చరిత్ర కూడా తెరకెర్క్కనుంది... ఆమె ఎవరో కాదు దావూద్ ఇబ్రహిం సోదరి హసీనా పార్కర్
     హసీన -ది క్వీన్ ఆఫ్ ముంబై:

    హసీన -ది క్వీన్ ఆఫ్ ముంబై:


    హసీన జీవితం పూర్తి ఎమోషనల్. ఓ వైపు అన్న పెద్ద డాన్. అతడికి చెల్లిగా ముంబైలో బతకాలంటే తను అంతకుమించిన డాన్ అయితేనే సాధ్యం. అందుకే ముంబై లోని ఓ ఏరియాలో ఈవిడను క్వీన్ గా ఆరాధించేవారు. దావూద్ ఇబ్రహీంకి ఉన్న 12 మంది అక్కజెళ్లెల్లలో హసీన పార్కర్ ఒక సోదరి. ముంబై నాగ్ పడ ప్రాంతంలో నివశించేది. అక్కడ తనకి బోలెడుమంది అభిమానులు శత్రువులు కూడా ఉండేవారు. అలాంటిచోట రాణిలా ఎలా బతికింది అన్నది హసీన -ది క్వీన్ ఆఫ్ ముంబై చిత్రంలో చూపించనున్నారు.

     గుండెపోటుతో మరణించింది:

    గుండెపోటుతో మరణించింది:


    హసీన 40ఏళ్ల వయసప్పుడు గుండెపోటుతో మరణించింది. తన జీవితం అంతా ఎంతో భావోద్వేగాలతో ముడిపడినది. ఆమె మరణం అనూహ్యం అని చెబుతారు.అన్న నీడలో ముంబైతోపాటు దేశ, విదేశాల్లో సైతం హసీనా పార్కర్‌ గడగడలాడించింది. ఇపుడు ఈ లేడీ డాన్ ఆఫ్ ముంబై జీవిత చరిత్ర తెరమ్మీదకి రానుంది. "హసీన -ది క్వీన్ ఆఫ్ ముంబై" గా బాలీవుద్ నటి శ్రద్దా కపూర్ నటిస్తోంది.

     సిద్ధాంత్ కపూర్ కూడా:

    సిద్ధాంత్ కపూర్ కూడా:


    దావూద్ సోదరి హసీనా పార్కర్‌‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది బాలీవుడ్‌‌. ఈ చిత్రానికి టైటిల్ గా దావూద్ సోదరి పేరునే ‘హసీనా' అని ఖరారు చేయడం గమనార్హం. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ ముఖ్యపాత్ర పోషిస్తోంది. శ్రద్ధా సోదరుడు సిద్ధాంత్ కపూర్ కూడా ఇందులో నటిస్తున్నాడు.

     పిల్లలతో పాటు:

    పిల్లలతో పాటు:


    అయితే ఈ విషయం లో మాట్లాడేందుకు హసీన బందువులు ఆ సినిమా సెట్స్ మీదకే వచ్చారు.., శ్రద్దాతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయిలోని మెహబూబ్ స్టూడియోస్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ లోకి అనుకోని వ్యక్తులు వచ్చారు. ఎవరో కాదు.. హసీనా పార్కర్ పిల్లలతో పాటు ఆమె సోదరుడు వరుస అయ్యే బందువు సమీర్ అంతులే సెట్స్ లో కనిపించారు.

     హసీనా బతికున్నప్పుడు:

    హసీనా బతికున్నప్పుడు:


    వీరిని చూసి శ్రద్ధతో పాటు యూనిట్ సభ్యులుషాక్ అయ్యారు. ఐతే వారు మాత్రం సరదాగానే సెట్స్ కు వచ్చారట. షూటింగ్ వివరాలు అడిగితెలుసుకున్న వాళ్ళు హసీనా బతికున్నప్పుడు తన నిజజీవితంలో ఉపయోగించిన రీడింగ్ గ్లాసెస్, ఇష్టమైన లిప్ స్టిక్ ను శ్రద్ధాకపూర్ కు గిఫ్ట్ గా ఇచ్చారట.

     ముక్కు పుడకఫ

    ముక్కు పుడకఫ


    ఈ చిత్రంలో ముఖ్యంగా స్లమ్ డెవలప్‌మెంట్ అథారిటిస్ డీలింగ్స్‌‌ గురించి చూపించబోతున్నామని దర్శకుడు చెప్పాడు. అనంతరం శ్రద్ధా మీడియాతో మాట్లాడుతూ హసీనా కుటుంబ సభ్యులు తమకు బాగా సహకరిస్తున్నారు.. ఆఖరికి హసీనా ముక్కు పుడకను ఇవ్వమంటే కాదనకుండా ఆమె కుటుంబ సభ్యులుఇ ఆనందంగా ఇచ్చారని శ్రద్ధా మీడియాతో చెప్పింది.

     స్మాయిల్ పార్కర్‌ హత్య:

    స్మాయిల్ పార్కర్‌ హత్య:


    హసీనా.. దావూద్ ముంబై వ్యాపారాలను, అక్రమ ఆస్తులను చూసేదని సమాచారం. నాగ్‌పాడాలోని గార్డన్ హాల్ అపార్టుమెంట్‌లో విలాసవంతమైన ఫ్లాట్‌లో ఉంటున్న ఆమెకు లేడీ డాన్‌గా గుర్తింపు ఉంది. ఆమె ప్రత్యక్షంగా మాఫియాను నడపకున్నా దక్షిణ ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఆమె ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదని అంటుంటారు. హసీనా భర్త ఇస్మాయిల్ పార్కర్‌ను 1991లో అరుణ్ గావ్లీ ముఠా హత్య చేయడంతో ఆమె వార్తల్లోకి వచ్చింది.

    English summary
    Shradha Kapoor met the members of Dawood’s family, who​ visited ​ her shooting of Haseena - the biopic on Dawood Ibrahim’s sister Haseena Parkar being directed by Apoorva Lakhia.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X