twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దేవుడు చేసిన మనుషులు’ సెన్సార్ పూర్తి...

    By Srikanya
    |

    హైదరాబాద్ : రవితేజ హీరోగా నటిం చిన సినిమా 'దేవుడు చేసిన మనుషులు'. ఇలియానా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటిస్ పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్ తో సెన్సార్ వారు సర్టిఫికేట్ ఇచ్చారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంతో రెడీ అయిన ఈ చిత్రాన్ని రిలయన్స్‌ ఎంట ర్‌టైన్‌మెంట్స్‌,సమర్పణలో శ్రీ వెం కటేశ్వర సినీచిత్ర పతాకంపెై ఛత్రపతి ప్రసాద్‌ నిర్మించారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న సందర్భంగా రిలీజ్‌ అవుతోంది.

    దర్శకుడు పూరి జగన్నాధ్ మాట్లాడుతూ...దేవుడున్నాడని మనస్పూర్తిగా నమ్మి ఈ సినిమా చూడండి అనే కార్డ్ వచ్చిన తర్వాత సినిమా స్టార్ అవుతుంది. హండ్రెడ్ పర్శంట్ ఎంటర్టైనర్ ఇది. నాకు రవితేజ కాంబినేషన్ లో చాలా మంచి హిట్ సినిమా అవుతుంది అన్నారు. హీరో రవితేజ మాట్లాడుతూ...పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో ఇది ఐదవ చిత్రం. ఈ కథ వినగానే ఎంతో ఇన్ స్పైర్ అయ్యాను. ఈ చిత్రంలోని సన్నివేశాలు వింటూంటే ఎంతో ఎక్సైట్ అయ్యాను. జగన్ కాంబినేషన్ లో మరో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అందర్ని అలరించే సినిమా అవుతుంది. జగన్ తో చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ ''రిలీజ్‌కి ముందే పాటలు విశేష ఆదరణ పొందడం ఆనందా న్నిచ్చింది. సినిమాకి సంబంధించిన అన్నికా ర్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రపం చవ్యాప్తంగా రిలీజ్‌కి రెడీ. అన్నివర్గాలను అలరించే పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమిది. రవితేజ-పూరి కాంబినేషన్‌లో మరో సూపర్‌హిట్‌ అందుకోనున్నాం.ఇడియట్ వంటి చాలా పెద్ద రేంజి సినిమా అవుతుంది'' అన్నారు.

    ప్రకాష్‌ రాజ్‌, డాబ్రహ్మానందం, అలీ, ఎం.ఎస్‌.నారా యణ, కోవెై సరళ, సుబ్బరాజు, ఫిష్‌ వెంకట్‌, జ్యోతిరానా తదితరులు నటిస్తున్నారు.కెమెరా: శ్యామ్‌.కె.నాయుడు, సంగీతం: రఘు కుంచె, పాటలు: భాస్క రభట్ల, ఎడిటింగ్‌: ఎస్‌. ఆర్‌.శేఖర్‌, ఫెైట్స్‌: విజయ్‌, డాన్స్‌: ప్రదీప్‌ ఆం థోని, దినేష్‌, సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సహనిర్మాత: భోగవల్లి బాపి నీడు, రిలయన్స్‌ ఎంట ర్‌టైన్‌మెంట్‌, ప్రొడక్షన్‌ డిజెైనర్‌: చిన్నా, కథ- కథనం- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

    English summary
    Ravi Teja's movie Devudu Chesina Manushulu (DCM) has finished its censor formalities. This film has attained the U/A certification and is likely to be released on the 15th of August. DCM has Ravi Teja is the leading role with Ileana being his lady love. It’s testing time for Ileana as this will be her second film to hit screens this month. Bramhandam plays the crucial role of God. DCM is being directed by Puri
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X