‘దేవుడు చేసిన..’ ఓవర్సీస్ ప్రింట్స్ ఫ్లైట్‌ మిస్

By Bojja Kumar

హైదరాబాద్: రవితేజ-ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం ఆగస్టు 15న గ్రాండ్‍‌గా విడుదలవుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఓవర్సీస్(విదేశాలకు) వెళ్లాల్సిన ప్రింట్స్‌ ఫ్లైట్ మిస్ అయ్యాయని తెలుస్తోంది. నిన్న వీటిని ఓ వ్యక్తి ఎమిరేట్స్ ఫ్లైట్ ద్వారా యూఎస్ తీసుకెళ్లాల్సి ఉండగా అతను రాత్రి 9.30 గంటలకు ఎక్కాల్సిన ఫ్లైట్‌ను అందుకోలేక పోయాడని సమాచారం.

అయితే వెంటనే తెల్లవారు ఝామున మరో విమానంలో అతను వాటిని తీసుకెళ్లిన్లు తెలుస్తోంది. ఈ చిన్నపాటి అంతరాయం వల్ల ఓవర్సీస్ షెడ్యూల్ తొలి షో కాస్త అటూ ఇటూగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి బేనర్ పై భారీ చిత్రాల నిర్మాత చత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

మాస్ మహారాజ్ రవితేజ సరసన గ్లామర్ స్టార్ ఇలియానా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యతిరానా, మానస, గాబ్రియల్ తదితరులు నటిస్తున్నారు.

ఫోటో గ్రఫీ: శ్యామ్ కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, సంగీతం : రఘు కుంచె, పాటలు: భాస్కరభట్ల, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, ఫైట్స్: విజయ్, డాన్స్: ప్రదీప్ ఆంథోని, దినేష్, స్టిల్స్: సాయి మాగంటి, కో-డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ రాజు ఆర్, క్యాషియర్: జంగపల్లి మొగలి, సమర్పణ: రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్, కో-ప్రొడ్యూసర్స్: భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X