twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరి రెమ్యూనరేషన్ లొల్లి...దానయ్యకు డెడ్‌లైన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత డివివి దానయ్య మధ్య డబ్బుల విషయంలో తగాదా ఏర్పడిన విషయం తెలిసిందే. నిర్మాత తనకు ఇవ్వాల్సిన రూ. 4.5 కోట్లు ఎగ్గొట్టారని పూరి దర్శకుల సంఘంలో ఫిర్యాదు కూడా చేసారు. సన్నిహితుల సలహాతో పూరి ఆ ఫిర్యాదును ఉపసంహించుకోవడం కూడా జరిగింది.

    అయితే తాజాగా దర్శకులు సంఘం నిర్మాత దానయ్యకు డెడ్ లైన్ విధించింది. సినిమా విడుదలకు ముందే పూరి రెమ్యూనరేషన్ సెటిల్ చెయ్యాలని ఆల్టిమేటం జారీ చేస్తూ...బుధవారం వరకు గడువు విధించారు. లేకుంటే నిర్మాత దానయ్యకు దర్శకుల సంఘం సహాయ నిరాకరణ చేస్తుందని హెచ్చరించారు. పూరి ఫిర్యాదు ఉప సంహరించుకున్నా...దర్శకుల సంఘం ఇప్పుడు ఇలా ఫైర్ కావడానికి కారణం దర్శకుల సంఘానికి దానయ్య చెల్లించాల్సిన కొన్ని టాక్స్ చెల్లింపులు చెల్లించక పోవడమే ప్రధాన కారణం.

    'కెమెరామెన్ గంగతో రాంబాబు' అక్టోబర్ 18న గ్రాండ్ గా విడుదలవ్వబోతోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది.

    ప్రకాష్‌రాజ్‌, గ్యాబ్రియల్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్‌ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్‌.

    English summary
    Puri Jagannath lodged a complaint against producer DVV Danayya for bothering him by not paying the remuneration of around Rs. 4.5 crores. Directors Association Dead line to producer DVV Danayya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X