గత కొద్దిరోజులుగా బాలీవుడ్ సూపర్ హిట్ 'ఎ వెన్స్‌డే' చిత్రం హోమం నిర్మాత ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారని,జె.డి దర్శకత్వంలో తీస్తారని ప్రచారం జరుగుతున్న విషంయ తెలిసిందే.అయితే అటువంటిదేమీ జరగలేదని...'ఎ వెన్స్‌డే' చిత్రం తెలుగు రీమేక్ హక్కులను తామెవరకీ ఇవ్వలేదని యుటివి మోషన్ పిక్చర్స్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ వధ్వా గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో "మా 'వెన్స్‌డే' సినిమాని ఫలానా దర్శకులు, నిర్మాతలతో కలసి మేం రీమేక్ చేయబోతున్నామని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు.ఇంతవరకు మేమెవరితోనూ దీనికి సంబంధించి ఒప్పందాలు చేసుకోలేదు. ఒరిజినల్ సినిమాకు ధీటైన రీమేక్ కోసం వివిధ ప్రతిభావంతులతో ఇప్పటికీ చర్చలు జరుపుతున్నాం'' అని తెలిపారు.