అక్కడ దుమ్ము దులుపుతున్న ‘డియర్ కామ్రేడ్’.. ఏ సినిమాకూ రాని స్థాయిలో కుమ్మేస్తుంది.!
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సీవీఎం), యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాను భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జూలై 28న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అయింది. దీనికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, అక్కడ మాత్రం ఈ సినిమా సత్తా చాటుతోంది.

మిశ్రమ స్పందన
ఈ సినిమా మంచి కాన్సెప్ట్‌తో వచ్చినప్పటికీ కొంచెం ల్యాగ్ ఉందని రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండతో పాటు రష్మిక మందన్నా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా లిల్లీ పాత్రలో రష్మిక ఇరగదీసేసిందని ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది.

కలెక్షన్ల పరంగానూ దెబ్బే
‘డియర్ కామ్రేడ్' తొలి రోజు భారీ స్థాయిలో వసూళ్లను సాధించింది. అయితే, సినిమా టాక్ మిశ్రమంగా ఉండడంతో ఆ తర్వాత జోరు తగ్గింది. మొత్తంగా మొదటి వారాంతంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 18.85 కోట్లు(డిస్ట్రిబ్యూటర్ షేర్) వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.56 కోట్లు రాబట్టింది. ఇందులో రూ.6.83 కోట్లు మొదటి రోజు వసూలు కావడం గమనార్హం. ఆ తర్వాత సినిమా కలెక్షన్లు దెబ్బకొట్టాయి.

హిందీలోకి రీమేక్ కష్టమేనట
ఆల్రేడీ దక్షిణాదిలో ఉన్న నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల అయిపోయింది. ఇక, హిందీలోనూ దీన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేశారు. ఇందులో భాగంగానే సినిమా విడుదలకు ముందే బాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ను చిత్ర యూనిట్ కలిసింది. దీని తర్వాత తాను ‘డియర్ కామ్రేడ్'ను హిందీలోకి రీమేక్ చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే, సినిమా ఫలితంతో ఈ రీమేక్ ఆగిపోయిందని అంటున్నారు.

అక్కడ మాత్రం సూపర్ హిట్
ఇటీవల ‘డియర్ కామ్రేడ్' అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో క్లిక్స్ వస్తున్నాయి. గతంలో ఏ సినిమాకూ రాని స్థాయిలో ‘డియర్ కామ్రేడ్' కుమ్మేస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాను చాలా మంది చూశారని తెలుస్తోంది. దీంతో పలు రికార్డులు కూడా బద్దలయ్యాయని సమాచారం.

బూతులతో చూపించారు
గతంలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి' సినిమాను అమేజాన్ ప్రైమ్‌లో సెన్సార్ లేకుండా చూపించారు. దీంతో సినిమాలో మ్యూట్ చేసిన బూతు డైలాగులు కూడా ఇక్కడ వినిపించారు. దీంతో విజయ్ సినిమాను భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ కారణంగానే ‘డియర్ కామ్రేడ్'కు కూడా ఊహించని స్పందన వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











