‘అర్జున్ రెడ్డి’ని చూపించినట్లే.. ‘డియర్ కామ్రేడ్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

తెలుగు సినీ ఇండస్ట్రీలో 'అర్జున్ రెడ్డి' చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న కొన్ని సంప్రదాయాలను మార్చేసింది. అంతేకాదు, మన ఫిల్మ్ మేకర్స్ పెట్టుకున్న సరిహద్దులను చెరిపివేసింది. దీంతో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో హీరో విజయ్ దేవరకొండ కూడా ఎంతో పాపులర్ అయిపోయాడు. అంతకు ముందు వరకు చిన్న హీరోలా కనిపించిన విజయ్.. ఆ తర్వాత స్టార్ అయిపోయాడు. ఇక, 'గీత గోవిందం' వంటి భారీ సక్సెస్‌తో ఈ యంగ్ హీరో క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే రానున్న 'డియర్ కామ్రేడ్'పై భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్నా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అవుతోంది. అందుకే ఆయా రాష్ట్రాల్లో విజయ్ అండ్ కో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ముగించేసింది.

Dear Comrade censor report is out

ఈ సినిమాపై తాజాగా ఓ అప్‌డేట్ వచ్చేసింది. అదే.. సెన్సార్ రిపోర్ట్. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. అంతేకాదు, ఈ సినిమా రన్‌ టైమ్ 2 గంటల 49 నిమిషాలు ఉంది. గతంలో వచ్చిన 'అర్జున్ రెడ్డి' కూడా దాదాపు మూడు గంటల రన్ టైమ్ ఉంది. లాంగ్ రన్ టైమ్ ఉన్నప్పటికీ ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు 'డియర్ కామ్రేడ్' కూడా అలాంటి మేజిక్‌నే క్రియేట్ చేస్తుందేమోనన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X