డియర్ కామ్రేడ్‌కు షాక్.. బ్యాన్ చేయాలంటూ కన్నడ ప్రేక్షకుల నిరసన.. ట్రోల్స్‌తో హంగామా
యంగ్ డైరెక్టర్ భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించారు. గత సినిమాల ప్రభావంతో ఇప్పటికే వీరికి క్రేజీ జోడీగా పేరుండటం కారణంగా సినిమాపై భారీ హైప్ నెలకొంది. దీనికి తోడు టీజర్, ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. ఓ రేంజ్ అంచనాల నడుమ ఈ రోజు (జులై 26) విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ లోగా సినిమా నిలిపివేయాలంటూ డిమాండ్స్ రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ఆ డిమాండ్స్ ఏంటి? బ్యాన్ చేయాలని అంటున్నదెవరు? వివరాల్లోకి పోతే..

నాలుగు భాషల్లో డియర్ కామ్రేడ్
బాహుబలి తర్వాత అదే రేంజ్‌లో నాలుగు భాషల్లో విడుదలైంది డియర్ కామ్రేడ్ సినిమా. ఇతర రాష్ట్రాల్లో సైతం విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని తెలుగుతో పాటు తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో ఏక కాలంలో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల చేయడం జరిగింది.

కన్నడ జనం ఫైర్
నాలుగు భాషల్లో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమా తెలుగు వర్షన్‌పై కన్నడికులు ఫైర్ అవుతున్నారు. అయితే అందుకు కారణం సినిమాలో ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలున్నాయని కాదు.. ఈ సినిమాను కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో కన్నడ వెర్షన్ కంటే ఎక్కువ థియేటర్లలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేయడం.

బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు
తమ సొంత రాష్ట్రంలో మాతృభాష కన్నడ వెర్షన్ కంటే ఎక్కువ థియేటర్స్‌లో తెలుగు వెర్షన్ డియర్ కామ్రేడ్ రిలీజ్ చేయడం అవమానంగా భావిస్తున్నారు కన్నడ ప్రేక్షకులు. ఈ మేరకు కర్ణాటకలో డియర్ కామ్రేడ్ తెలుగు వర్షన్ వెంటనే బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్స్ మొదలెట్టారు కన్నడికులు. తమ సొంత భాషలో సినిమా ఉండగా తమ మీద బలవంతంగా తెలుగు చిత్రాలను రుద్దితే సహించమని వారు హెచ్చరిస్తున్నారు.

డియర్ కామ్రేడ్ గురించి
డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రెండోసారి జంటగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా సమర్పించిన ఈ సినిమాకు నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. తొలి రోజే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది.


Click it and Unblock the Notifications











