డియర్ కామ్రేడ్ సినిమాకు మరో షాక్.. ఆన్‌లైన్‌లో ఫుల్ మూవీ
Recommended Video
సినిమా ఇండస్ట్రీని పైరసీ బెడద వెంటాడుతూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పైరసీ భూతాన్ని అరికట్టలేక పోతున్నాయి సైబర్ నిఘా వర్గాలు. ఇప్పటికే ఎన్నో సినిమాలు పైరసీ భారిన పడి నష్టాలు మూటగట్టుకోగా తాజాగా ఆ పైరసీ సెగ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'డియర్ కామ్రేడ్' సినిమాకు కూడా తాకింది. తొలిరోజు నాలుగు షోలు కూడా ముగియక ముందే ఆన్ లైన్ వేదికపై డియర్ కామ్రేడ్ కనిపించడంతో షాకవుతున్నారు జనం.

డౌన్ లోడ్ చేసుకునే వీలు
భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా తొలిరోజే తమిళ్ రాకర్స్ ఆన్ లైన్ వేదికపై కనిపించింది. ఈ పైరసీని డౌన్ లోడ్ చేసుకునే వీలు కూడా ఉండటంతో లక్షల్లో డౌన్ లోడ్స్ జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే తమిళ్ రాకర్స్ పైరసీకి గురైన ఓ బేబీ, ఇస్మార్ట్ శంకర్ జాబితాలో డియర్ కామ్రేడ్ కూడా చేరిపోయింది.

మిశ్రమ స్పందన.. వరుస షాకులు
నిజానికి డియర్ కామ్రేడ్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. విడుదలకు ముందే ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ సృష్టించిన హంగామా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ తీరా విడుదలయ్యాక మొదటి షో తోనే మిశ్రమ స్పందన తెచ్చుకోవడం మొదటి షాకింగ్ పరిణామం కాగా, విడుదల రోజే డియర్ కామ్రేడ్ షోస్ నిలిపివేయాలంటూ కన్నడికుల ఆందోళనలు షాకిచ్చాయి. తాజాగా ఈ పైరసీ రూపంలో మరో షాక్ తగిలింది.

నాలుగు భాషల్లో డియర్ కామ్రేడ్
బాహుబలి తర్వాత అదే రేంజ్‌లో నాలుగు సౌత్ ఇండియన్ భాషల్లో విడుదలైంది డియర్ కామ్రేడ్ సినిమా. ఇతర రాష్ట్రాల్లో సైతం విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని తెలుగుతో పాటు తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో ఏక కాలంలో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల చేయడం జరిగింది.

డియర్ కామ్రేడ్ గురించి
డియర్ కామ్రేడ్ సినిమాలో క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రెండోసారి జంటగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా సమర్పించిన ఈ సినిమాకు నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. తొలి రోజే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ నడుమ రెండో రోజు ప్రదర్శించబడుతోంది డియర్ కామ్రేడ్.


Click it and Unblock the Notifications











