‘డియర్ కామ్రేడ్’ కలెక్షన్లు చెప్పేశారు, పరిస్థితి ఇదీ... నిజం ఒప్పుకున్న నిర్మాతలు!
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'డియర్ కామ్రేడ్' మూవీ జులై 26న విడుదలైన మిక్డ్స్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో లేవనే వార్తలు కూడా మీడియాలో హచ్ చల్ చేస్తున్నాయి. ఈ అంశాలపై వివరణ ఇచ్చేందుకు నిర్మాతలు మీడియా ముందుకు వచ్చారు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్నాటకలో ఆయా భాషల్లో రిలీజ్ చేశారు.

80 శాతం రికవరీ అయ్యాయి
‘డియర్ కామ్రేడ్' మూవీ విడుదలైన ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. అన్ని చోట్ల బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేస్తోంది. ఈ విషయంలో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 27 కోట్లకు అమ్మడం జరిగింది. ఫస్ట్ వీకెండ్ 21 కోట్లు రికవరీ అయ్యాయి. వరల్డ్ వైడ్ 80 శాతం రికవరీ అయింది... అని నిర్మాతలు ప్రకటించారు.

వర్షాల వల్ల సినిమా కొంత ఎఫెక్ట్ అయింది
ఈ గురువారం(ఫస్ట్ వీక్) అందరూ బ్రేక్ ఈవెన్ చేరుకుని లాభాల్లోకి వస్తారు. సినిమా వసూళ్ల విషయంలో అందరూ హ్యాపీగా ఉన్నారు. వర్షాలు పడటం వల్ల కొంత ఎఫెక్ట్ అయింది. ఆంధ్రాతో పాటు తెలంగాణలో బాగా వర్షాలు పడుతున్నాయి. కానీ సినిమాకు మౌత్ టాక్ బావుండటం వల్ల జనాలు థియేటర్లకు వస్తున్నారు. బుక్ మై షోలో బుకింగ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి.... అని నిర్మాతలు స్పష్టం చేశారు.

ఆ రెండు విషయాలు చెప్పడానికే ఈ ప్రెస్ మీట్
ఈ ప్రెస్ మీట్ రెండు విషయాలు చెప్పడానికి పెట్టాం. సినిమా విడుదలైన రోజు మూవీ స్లో అనే టాక్ వచ్చింది. అందుకే 13 నిమిషాలు సినిమాను ట్రిమ్ చేశాం. సినిమాలో క్యాంటీన్ సాంగ్ బాగా పాపులర్ అయింది. లెంత్ ఎక్కువ అవుుందని మూవీలో పెట్టలేదు. అది కావాలని చాలా మంది నుంచి ఫీడ్ బ్యాక్ రావడంతో దాన్ని కూడా కలిపాం. ఆదివారం నుంచే ఈ అప్ డేటెడ్ వెర్షన్ ప్రదర్శితం అవుతోంది. రెస్పాన్స్ కూడా సూపర్బ్‌గా ఉందని నిర్మాతలు తెలిపారు.

ఓవర్సీస్ కలెక్షన్స్
కాగా.. ఓవర్సీస్ ఏరియాలో ఈ చిత్రానికి మంచి స్పందన ఉందని తెలుస్తోంది. ప్రీమియర్ షోల ద్వారా $310,824 గ్రాస్ రాబట్టింది. శనివారం నాటికే $510,935 రీచ్ అయింది. ఫస్ట్ వీకెండ్ $650K వసూలు చేసింది. నైజాంలో కూడా వస్లూ ఫర్వాలేదు. ఇక్కడ తొలివారాంతం రూ. 5.68 కోట్లు రాబట్టింది.


Click it and Unblock the Notifications











