'డియర్ కామ్రేడ్'పై ఊహాగానాలు.. అలాంటి చిత్రం కాదంట!
యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. ఆగష్టు 15 న విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం విడుదల కానుంది. ఈ లోపే విజయ్ దేవరకొండకు కొత్త చిత్రానికి సంబందించిన ఊహాగానాలు మొదలైపోయాయి. డెబ్యూ దర్శకుడు భరత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ నటిస్తున్నాడు. ఈ చిత్రం కమ్యూనిస్ట్ భావజాలంతో రూపొందుతోందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాకినాడ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే ఈచిత్ర షూటింగ్ ఈస్ట్ గోదావరిలో ప్రారంభం అయింది. ఈ చిత్రం కమ్యూనిస్ట్ భావజాలంతో తెరకెక్కడం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

ఈ సినిమా పూర్తిగా హీరో పాత్ర ఆధారంగానే సాగుతుందట. డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో కూడా రష్మిక మందననే హీరోయిన్. గీత గోవిందం చిత్రంలో వీరిద్దరూ నటించిన సంగతి తెలిసిందే. డియర్ కామ్రేడ్ చిత్రాన్ని భారీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ నటిస్తున్న మరో చిత్రం టాక్సీవాలా గురించి ఎలాంటి అప్డేట్ లేదు.


Click it and Unblock the Notifications











