నీవంటే అసహ్యం, మరీ అంత చెత్తగానా: ‘విజయదేవర’తో లిప్‌లాక్‌పై నెటిజన్ల ఫైర్.. రష్మిక దిమ్మతిరిగే జవాబు
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన డియర్ కామ్రేడ్ టీజర్ వివాదంలో చిక్కుకొన్నది. ఇటీవల విడుదలైన ఈ టీజర్‌లో గాఢమైన లిప్‌లాక్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. గతంలో గీత గోవిందం సినిమాలో రష్మిక లిప్‌లాక్‌పై కన్నడవాసులు కన్నెర్ర జేసిన సంగతి తెలిసిందే. అది ఇంకా మరిచిపోకముందే రష్మిక మందన్న మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురి కావడం చర్చనీయాంశమైంది.

గీతా గోవిందం తర్వాత రష్మిక మరో వివాదంలో
గీతా గోవిందం సినిమా తర్వాత వెంటనే విజయ్ దేవరకొండతో రష్మిక జట్టుకట్టింది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ టీజర్‌తో ప్రమోషన్‌ను ప్రారంభించింది. కాలేజీలో యూత్ మధ్య వార్స్ నేపథ్యంగా సినిమా ఉంటుందనే సంకేతాలను టీజర్ ఇచ్చింది. కానీ ఈ సినిమాలో వర్షం సాక్షిగా విజయ్ దేవరకొండ, రష్మిక పెట్టుకొన్న లిప్ లాక్ హాట్ హాట్‌గా కనిపించింది.

రష్మిక నీవంటే అసహ్యం
ప్రస్తుతం డియర్ కామ్రేడ్‌లో రష్మిక మందన్న పెట్టుకొన్న లిప్‌లాక్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. నిమిషం లోపు ఉన్న ఈ గాఢ చుంబనం నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. లిప్ కిస్ పెట్టుకొన్నందుకు రియల్లీ సారీ.. ఇక నుంచి నేను నీ ఫ్యాన్ కాదు. నీవంటే అసహ్యం అని ఓ నెటిజన్ ఘాటుగా స్పందించాడు.

రష్మిక ఇంత చెత్తగా ఎందుకు
రష్మిక నీకు నీవు సినిమాల్లో ఎందుకు ఇంత చెత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకొంటావు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీలో నటించేందుకు ప్రయత్నించు. ప్రతీ సినిమాలో లిప్ కిస్ అవసరమా? విజయ దేవరకొండ నీవు గొప్ప సక్సెస్‌తో రావాలనుకొన్నాం. కానీ డియర్ కామ్రేడ్ అలా కనిపించడం లేదు. నీవేమైనా ఇమ్రాన్ హష్మీవా? అని మరో నెటిజన్ తీవ్రంగా స్పందించాడు.

టీజర్‌పై కన్నడ వాసుల ఆగ్రహం
డియర్ కామ్రేడ్ టీజర్ కూడా కన్నడలో రిలీజ్ చేశారు. రష్మిక వ్యవహారంపై కన్నడ అభిమానులు ఓ రేంజ్‌లో ట్రోల్లింగ్ చేశారు. సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితిని రష్మిక మందన్న ఎదుర్కొన్నారు. దాంతో ఈ వివాదానికి తొందరగా పుల్‌స్టాప్ పెట్టేందుకు రష్మిక రంగంలోకి దిగింది.

టీజర్ చూసి సినిమాపై మీ నిర్ణయమా?
నెటిజన్ల కామెంట్లు మితిమీరి పోతుంటే రష్మిక స్పందించారు. చిన్న టీజర్ చూసి సినిమాపై ఓ నిర్ణయానికి రావడం సరికాదు. కథ డిమాండ్ మేరకే అలాంటి సీన్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. సినిమా పూర్తిగా చూశాక అప్పుడు చెప్పండి అంటూ కౌంటర్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











