డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ టాక్: విజయ్ దేవరకొండ మరో సెన్సేషన్.. బాహుబలి తరహాలోనే..

యాంగ్రీ యంగ్ మ్యాన్ యాటిట్యూడ్‌తో మరో సంచలన విజయంపై దృష్టిపెట్టిన విజయ్ దేవరకొండ తాజాగా డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం జూలై 26వ తేదీన రిలీజ్‌కు సిద్ధమైంది. నూతన దర్శకుడు భరత్ కమ్మ డైరెక్షన్‌లో లక్కీ బ్యూటీ రష్మిక మందన్నతో మరోసారి జతకట్టాడు. ఈ సినిమా కేవలం దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా అనూహ్యమైన క్రేజ్‌ను సంపాదించుకొన్నది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెరగడానికి, సక్సెస్ వైపు నడిపించే ప్రధాన కారణాలు ఇవే..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కెమిస్ట్రీ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కెమిస్ట్రీ

గీతా గోవిందంలో రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ కెమిస్ట్రీకి యూత్ బ్రహ్మరథం పట్టారు. లిప్‌లాక్‌లతో ఎప్పటిలానే అదరగొట్టాడు. ఆ సినిమా భారీ విజయాన్ని అందించడంతో భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ కోసం మరోసారి తెరపైన మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు రష్మిక, విజయ్ మందన్న కెమిస్ట్రీ మరో కారణం.

విజయ్ దేవరకొండ యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా

విజయ్ దేవరకొండ యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా

అర్జున్ రెడ్డి, నోటాతో యాంగ్రీ యంగ్ మెన్‌గా ముద్ర వేసుకొన్న విజయ్ దేవరకొండ మరోసారి అదే యాటిట్యూడ్‌తో ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నాడు. టీజర్లు, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఇప్పటికే భరత్ కమ్మ కథ, స్క్రీన్ ప్లే బాగున్నాయనే టాక్ వినిపిస్తున్నది. ఇలాంటి అంశాలు సినిమాను మరింత క్రేజ్‌గా మార్చాయి.

బాహుబలి మూవీని మినహాయిస్తే

బాహుబలి మూవీని మినహాయిస్తే

బాహుబలిని మినహాయిస్తే.. టాలీవుడ్‌లో నాలుగు దక్షిణాది భాషల్లో ఓ హీరో సినిమాలు విడుదలైన దాఖలాలు లేవు. డియర్ కామ్రెడ్‌తో విజయ్ దేవరకొండ ఓ అరుదైన ఫీట్‌ను సాధించబోతున్నాడు. ఏ తెలుగు హీరోకు దక్కని క్రేజ్‌ను విజయ్ దేవరకొండ దక్కించుకొన్నాడు. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది.

ఫీల్‌గుడ్‌గా సంగీతం

ఫీల్‌గుడ్‌గా సంగీతం

డియర్ కామ్రేడ్ సినిమాకు తమిళ మ్యూజిక్ దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే మ్యూజిక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. దక్షిణాది అన్ని భాషల్లో పాటలు ట్రెండింగ్‌గా, క్రేజీగా మారాయి. ప్రతీ పాట దేనికదే విలక్షణ శైలిని కలిగి ఉన్నది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ట్రైలర్, టీజర్లలో సత్తా చాటింది.

భరత్ కమ్మ దర్శకత్వంలో

భరత్ కమ్మ దర్శకత్వంలో

డియర్ కామ్రేడ్ చిత్రం యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందనే మాట వినిపిస్తున్నది. స్టూడెంట్ పాలిటిక్స్, లవ్, ఎమోషన్, అన్నీ అంశాలు కూడా సినిమాను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి అవకాశాలు ఉన్నాయి అని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. భరత్ కమ్మ రచన, విజన్ ఈ సినిమాకు ఓ ఎసెట్‌గా చెబుతున్నారు. రష్మిక ఫెర్ఫార్మెన్స్ హైలెట్‌గా ఉండబోతుందనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X