కపట నాటకాలెందుకు? దీపిక పదుకోన్‌కు కౌంటర్
హైదరాబాద్: ప్రముఖ ఆంగ్ల పత్రికలో వారం క్రితం ప్రచురితమైన " OMG: Deepika Padukone's cleavage show" కథనంపై బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోన్ కస్సుబుస్సులాడిన సంగతి తెలిసిందే. ‘అవును, నేను మహిళను. నాకు వక్షోజాలుంటాయి, దాని వల్ల మీకేంటి సమస్య' అంటూ కౌంటర్ ఇచ్చింది. మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదంటూ మండి పడింది.
సదరు కథనం విషయం పక్కన పడితే, ఆన్ లైన్ మీడియాలో ఇలాంటి కథనాలు సాధారణమే. నవ రసాల్లో శృంగార రసం లాంటిదన్నమాట. మేగజైన్లు, కింగ్ ఫిషర్ లాంటి క్యాలెండర్ల కోసం అందాలన్నీ ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ సెక్సీ గర్ల్ ఇమేజ్ కోసం తహతహలాడే దీపిక పదుకోన్ లాంటి వారు అలాంటి వ్యాఖ్యలు చేయడం కాస్త విడ్డూరమే! దీపిక పదుకోన్ కేవలం పబ్లిసిటీ కోసమే ఆ పత్రిక కథనంపై అలా ప్రవర్తించిందనే విమర్శలూ లేకపోలేదు.

తాజాగా సదరు ఆంగ్ల పత్రిక దీపిక తీరును ఎండగడుతూ కౌంటర్ కథనం ప్రచురించింది. ‘డియర్ దీపికా, అవర్ పాయింట్ ఆప్ వ్యూ' అనే హెడ్ లైన్ తో సాగిన ఈ కథనంలో దీపిక పదుకోన్ కేవలం తన తాజా సినిమా(ఫైండింగ్ ఫనీ)కి పబ్లిసిటీ కల్పించేందుకే ఈ వివాదానికి తెర తీసిందనే భావన వ్యక్త పరిచింది. దీపికా...కపట నాటకాలెందుకు? అంటూ ప్రశ్నించింది. గతంలో దీపిక పదుకోన్ వివిధ మేగజైన్ల కోసం ఇచ్చిన హాట్ అండ్ సెక్సీ ఫోటోలను ప్రదర్శిస్తూ దీపిక వ్యాఖ్యలపై ఎదురు దాడికి దిగారు.
‘షారుక్ ఖాన్ 8 ప్యాక్స్' బాడీ మాదిరిగా....నీ క్లీవేజ్(ఎద అందాలు) సెక్సీగా ఉన్నాయి కాబట్టే ఇలాంటి కథనం ప్రచురించాం. ఇందులో అవమానించే అంశం విషయం ఏమీ లేదు. అదొక కాంప్లిమెంట్ లాంటి కథనం. షారుక్ ఖాన్ 8 పాక్ ఆబ్స్ విషయంలో కూడా "OMG...Shah Rukh's 8-pack sexy abs!!!" అనే కథనం ప్రచురించాం. మేమేమీ మహిళల ప్రైవేట్ పార్ట్స్ జూమ్ చేసి చూపెట్టడం లేదు. ఒక మీడియా సంస్థగా మాకూ కొన్ని విలువలు ఉన్నాయి' అంటూ దీపిక ప్రవర్తనను ఉద్దేశించి సదరు ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది.


Click it and Unblock the Notifications











