twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు పరిశ్రమ షాక్.. 10 రోజుల్లో 6 మరణాలు

    By Srikanya
    |

    హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ ఈ పదిరోజుల్లో 6 మరణాలు సంభవిచటంతో పలువులు సినీ ప్రముఖలు విషాదంలోనూ, ఆలోచనలోనూ పడిపోయారు. ఆ మధ్యన వరసగా హాస్య నటులు మరణాలు తెలుగు పరిశ్రమలో జరిగి అందరినీ కలవరపరిచాయి. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్దితి ఏర్పడింది.

    ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి మరణంతో ఈ విషాదం ప్రారంభమైంది. అదేరోజు మరో రచయిత శ్రీనివాస్ చక్రవర్తి (జగదేక వీరుడు అతిలోక సుందరి ఫేమ్) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ ఇద్దరూ ఒకే రోజు చనిపోవడం బాధ కలిగించింది.

    తర్వాత మరో సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ తల్లి బాత్ రూంలో జారిపడి అపస్మారక స్థితిలోనే ప్రాణాలు విడిచారు. ఇక ఆ తర్వాత నాటకరంగ ప్రముఖుడు, పలువురు స్టార్ హీరోలకు నటనలో శిక్షణ ఇచ్చిన చాట్ల శ్రీరాములు గత శనివారం అనారోగ్యంతో మరణించారు.

    Deaths haunting Telugu movie industry again

    ఆ విషాదం నుంచి తేరుకునే ముందే.. విలక్షణ నటుడు, హీరో రంగనాథ్ ఆత్మహత్యతో చేసుకున్నారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే టీవీ రంగానికి చెందిన మరో కళాకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    అప్పట్లో టీవీలో పాపుల్ డాన్స్ షో 'ఆట'లో డాన్స్ మాస్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భరత్ ఆర్థిక ఇబ్బందులతో తనువు చాలించాడు. భరత్ ఆత్మహత్య చేసుకోవడంపై తోటీ కళాకారులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆట ఫ్రోగ్రాంలో శ్రీవిద్యతో కలసి అతను చేసిన డాన్స్ అప్పట్లో ఆట ఫ్రోగ్రామ్ కే హైలెట్ అయ్యేలా ఉండేదని తోటి కళాకారులు అంటున్నారు.

    English summary
    In the last 10 days Tollywood saw 6 deaths. Devi Sri Prasad's father and film writer Satyamurthy passed away, on the same day writer Srinivasa Chakravarthy too passed away. Then Chatla Sriramulu, then Anup Rubens' mother died and next Ranganath's suicide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X