twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తారల తెరంగట్రానికి తెలుగు తలుపులు

    By Pratap
    |

    హైదరాబాద్: సినీరంగంలో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరే తారలకు తెలుగు సినీ రంగం తలుపులు బార్లా తెరుస్తోంది. తెలుగు సినీ రంగం కొత్త తారలకు మెండుగా అవకాశాలు ఇస్తోంది. ముందు తెలుగులో అడుగు పెడితే ఆ తర్వాత బాలీవుడ్ వంటి ఇతర భాషా చిత్రాల్లోకి అడుగు పెట్టే అవకాశాలు వస్తున్నాయి. తాజా ముఖాల కోసమే టాలీవుడ్ ఎల్లవేళలా అన్వేషణా సాగిస్తోంది. వచ్చే రెండు నెలల కాలంలో తెలుగులో డజను మంది కొత్త తారలు కనిపించబోతున్నారు.

    అంతర్జాతీయ అందాల పోటీల్లో విజేతలుగా నిలిచిన అమ్మాయిలకు, ముంబై మోడల్స్‌కు, తారల బంధువులకు తెలుగు సినీ రంగం స్వర్గధామంగా కనిపిస్తోంది. తాజాగా మలయాళీ నటి కాథరిన్ తెరెసా రెండు భారీ సినిమల్లో నటిస్తోంది. అల్లు అర్జున్ ఇద్దరు అమ్మాయిలతో సినిమాలోనూ నాని పైసా సినిమాలోనూ ఈ భామా మణి అందాలను ఆరబోయడానికి సిద్ధపడింది.

    ప్రియాంక చోప్రా కజిన్ బార్బీ హాండా కూడా తెలుగుతో సినీ ఆరంగేట్రం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2011 మిస్ వరల్డ్ కెనడా సెమీ ఫైనలిస్టు ప్రియా బెనర్జీ, థాయ్ నటి పింకీ సావిక, బహ్రెయిన్‌కు చెందిన మోడల్ నోవాటో తెలుగు సినిమాల్లో కనిపించబోతున్నారట.

    తెలుగు అమ్మాయిలు మాత్రం తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. ఇటీవల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అంజలి కనిపించి అదరగొట్టింది. అయినా తెలుగు నిర్మాతలు పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు ఇతర భాషలకు చెందిన అమ్మాయిల వేటలోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. అయితే, లో బడ్జెట్ సినిమాల సంఖ్య దాదాపు రెండింతలు కావడంతో, హీరోయిన్ల అవసరం ఇంకా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహేష్ బాబుతో సినిమా తీస్తున్న నిర్మాతలు కూడా కొత్త అమ్మాయి కోసం వెతుకుతున్నారట.

    English summary
    Be it international beauty pageant winners, models from Mumbai or relatives of established actresses, they seem to be coming from everywhere, thick and fast at that. Leading the line of beauties waiting to be launched is Malayali actress, Catherine Tresa, who is doing two big ticket films — Allu Arjun's Iddarammayilatho and Nani's Paisa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X