twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాక్‌డౌన్‌లో అనుష్క లుక్ బయట పడింది.. అలా వారితో వీడియో కాల్‌

    |

    సోషల్ మీడియాలో కొందరు సెలెబ్రిటీలు తెగ హడావిడి చేస్తుంటారు. గంటకో ఫోటో పెట్టుకుంటూ నానా హంగామా చేస్తుంటారు. నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటారు. అయితే కొందరు మాత్రం అంతగా యాక్టివ్‌గా ఉండరు. సినిమా తెరపై మాత్రమే కనిపిస్తుంటారు. అప్పుడప్పుడు సినీ ఫంక్షన్లలో కనిపిస్తుంటారు. ఇలాంటి కేటగిరీకి చెందిన వారిలో అనుష్క ఉంటుంది. సిల్వర్ స్క్రీన్‌పై, సినీ ఈవెంట్లలో తప్పా మరెక్కడా అంతగా కనిపించదు.

    లాక్ డౌన్ అంతా హడావిడి..

    లాక్ డౌన్ అంతా హడావిడి..

    లాక్‌డౌన్‌లో సెలెబ్రిలందరూ హడావిడి చేశారు. సెల్ఫీలు దిగుతూ వంట గదిలో గరిట తిప్పుతూ ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఇలా ఏదో ఓ రకంగా సోషల్ మీడియాలో సందడి చేశారు.అయితే అనుష్క మాత్రం లాక్ డౌన్‌లో ఎలా ఉంది? ఏం చేస్తూ ఉంది? అనే విషయాలు మాత్రం ఎవ్వరికీ తెలియలేదు. తాజాగా అనుష్క లుక్ బయటకు వచ్చింది.

    వీడియో కాల్‌లో వేదం టీమ్..

    వీడియో కాల్‌లో వేదం టీమ్..

    వేదం చిత్రం వచ్చి దశాబ్దమైంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వేదం సినిమా ట్రెండ్ అవుతోంది. వేదం సినిమా గురించి చెబుతూ అల్లు అర్జున్ తెగ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు బన్నీ చేసిన ట్వీట్ తెగ వైరల్ అయింది. చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపాడు.

    మెరిసిన అనుష్క..

    మెరిసిన అనుష్క..

    వేదం టీమ్ వీడియో కాల్‌లో సందడి చేసినట్టు బన్నీ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు అనుష్క కూడా అందులో జాయిన్ అయింది. వీడియో కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు తీసిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. దాదాపు దశాబ్దం తరువాత వేదం టీమ్‌తో ఇంటరాక్ట్ అవుతున్నామని తెలిపాడు.

    చెప్పలేని ఫీలింగ్..

    చెప్పలేని ఫీలింగ్..

    ఇన్నేళ్లు అయ్యాక కూడా మా అందరికీ అదే ఫీలింగ్ ఉందన్నాడు. చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికి మరో సారి ధన్యవాదాలని తెలిపాడు. ఈ వీడియో కాల్‌లో చిత్ర నిర్మాతలు, కీరవాణి, మంచు మనోజ్, క్రిష్, అల్లు అర్జున్, అనుష్క పాల్గొన్నారు. ఈ అందరిలో కెల్లా అనుష్క వైపే అందరి దృష్టి మళ్లింది. సరోజ పాత్రలో అనుష్క నటన అసామాన్యమని నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

    English summary
    Allu Arjun Anushka And Vedam Team Are Chit Chat In Video Call. Interacting with Vedam Team After a Decade again . The love and warmth is still the same DecadeofVedam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X