డెక్కన్ చార్జర్స్ టీంకి తమన్ మ్యూజిక్‌తో చార్జింగ్
వరుస హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న యువ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ త్వరలో తన సంగీతంతో హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్ టీంకి చార్జింగ్ ఇవ్వబోతున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఐపిఎల్ సీజన్ 5 కి గాను ఈ టీం కోసం తమన్ టైటిల్ సాంగ్ కంపోజ్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని తమన్ తన ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించాడు. ''నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను ఆ ఆటకు మరింత దగ్గరవుతున్నాను. డెక్కన్ చార్జర్స్ టీంకు టైటిల్ సాంగ్ కంపోజ్ చేయబోతున్నాను. చాలా ఎగ్జైటెడ్ గా ఉంది'' అంటూ పేర్కొన్నాడు. ఇప్పటికే వెంకటేష్, రాణా దగ్గుబాటి, సిద్ధార్థ్ డెక్కన్ చార్జర్స్ టీంను ఫాలో అవుతున్నారు. తాజాగా తమన్ కూడా ఆ లిస్టులో చేరాడు.
కందిరీగ, దూకుడు, బాడీగార్డ్, బిజినెస్ మేన్ ఇలా పలు విజయవంతమైన చిత్రాలకు తమన్ సంగీతం అందించారు. మరో భారీ బడ్జెట్ సినిమాకు వాయించే అవకాశం దక్కించుకున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-వివి వినాయక్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యాడు. ఈ అవకాశం ద్వారా తమన్ తొలిసారిగా మెగా హీరోతో పని చేసే ఛాన్స్ కొట్టేశాడు.


Click it and Unblock the Notifications











