Cinema Buzz: రేపు విడుదలయ్యే సినిమాల విశేషాలు
హైదరాబాద్: వీకెండ్ వచ్చిదంటే చాలు ఏదో ఒక సినిమా విడుదలకు సిద్దంగా ఉంటుంది. వారాంతం కావడంతో ఓపెనింగ్స్ బాగా వస్తాయనే ఉద్దేశ్యంతో చాలా మంది నిర్మాతలు శుక్రవారం సినిమాను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ శుక్రవారం(రేపు) కూడా పలు సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. అందులో గౌతం మీనన్ దర్శకత్వంలో నాని-సమంత జంటగా 'ఎటో వెళ్లి పోయింది మనసు', సాయిరాం శంకర్ 'యమహో యమ' చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం...
1. ఎటో వెళ్లి పోయింది మనసు
చిన్ననాటి స్నేహం ఎంతో మధురమైంది. వయసుతోపాటు ఇద్దరి వ్యక్తుల మధ్య ఆ స్నేహం ఎలాంటి ఆటుపోట్లకు గురైంది, మార్పులకు లోనైంది.. అన్న పాయింట్‌తో వస్తున్న చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు'. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని, సమంత హీరోహీరోయిన్లు. గౌతం మీనన్ మార్కుతో సాగే ప్రేమకథా చిత్రం. సి.కళ్యాణ్ నిర్మాత కాగా, అలనాటి నటి చంద్రకళ కుమార్తె రేష్మ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 14న విడుదలువుతోంది.
2. యమహో యమ
పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా 'యమహో యమ' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పార్వతి మెల్టన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రానికి జితేందర్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో గతంలో వచ్చిన యముడి చిత్రాల కంటే ఈ చిత్రం ఎంతో విభిన్నంగా వుంటుందట. యమధర్మరాజుగా శ్రీహరి, ఆయనకు జతగా చిత్రగుప్తుని పాత్రలో ఎమ్మెస్ నారాయణ ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఈచిత్రం డిసెంబర్ 14న విడుదలవుతోంది.
3. అల్లరి పిల్లోడు
నూతన తారలతో శ్రీ కృష్ణా శంకర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన 'అల్లరి పిల్లోడు' చిత్రం ఈనెల 14న విడుదలకు సిద్ధమైంది. కె.రవిప్రకాష్ దర్శకత్వంలో కనమర్లపూడి కోటేశ్వరరావు నిర్మించారు. చిన్నతనం నుండి అల్లరిచిల్లరిగా తిరిగిన కుర్రాణ్ణి తల్లిదండ్రులు ఏ విధంగా మార్చారన్న కథాంశంతో ఈ చిత్రం నిర్మించారు.
4. లైవ్
జై, లక్ష్మీరాయ్, ప్రియా ఆనంద్ నటీనటులుగా రూపొందిన ఓ తమిళ చిత్రాన్ని లైవ్ అనే టైటిల్ తో తెలుగులో విడుదల చేస్తున్నారు. జర్నీ చిత్రంతో జై తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అహ్మద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రవీణ్ నేలపాటి సమర్పణలో గ్రీన్ టీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాజేష్, ఎస్. తెలుగులో అనువదిస్తున్నారు. సంగీతం: యువన్ శంకర్. డిసెంబర్ 14న సినిమా విడుదలవుతోంది.
5. హాలీవుడ్లో రూపొందిన విజయవంతం అయిన 'యాక్ట్ ఆఫ్ వాలర్' చిత్రాన్ని తెలుగులో అనువదించి 'తీవ్రవాది' పేపరుతో విడుదల చేస్తున్నారు. సంధ్య పిక్చర్స్ పతాకంపై సుధాకర్ విడుదల చేస్తున్న ఈచిత్రం పూర్తిగా తీవ్రవాదం నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రానికి దర్శకత్వం: మైక్ మొకాయ్, స్కాట్ వా. విడుదల: డిసెంబర్ 14న.
6. మరో వైపు 'కాల చక్రం 2077' అనే మరో హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం కూడా డిసెంబర్ 14న విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











