ఆ ఇద్దురు స్టార్ హీరోలతో సరితూగ గలడా ఈ హీరో....

By Sindhu

వెంకటేష్ 'నాగవల్లి" కోసం, నాగార్జున 'రగడ" కోసం తన చిత్రాన్ని వాయిదా వేస్తే ఒప్పుకోనంటున్నాడు రవితేజ. 'మిరపకాయ్" చిత్రాన్ని డిసెంబర్ నెలాఖరులోగా విడుదల చేయాల్సిందేనని పట్టుబడుతున్నాడు. రాంగోపాల్ వర్మ నిర్మాతగా రవితేజ జ్యోతిక జంటగా రూపొందిన 'షాక్" అనే షాకింగ్ చిత్రం ద్వార దర్శకుడిగా పరిచయమైన హారీష్ శంకర్ దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుప్పాల అనే కొత్త నిర్మాత నిర్మిస్తున్న 'మిరపకాయ్" షూటింగ్ పూర్తి చేసుకుంది. హైదరాబాద్, రాజమండ్రి, స్విట్జర్లాండ్, బ్యాంకాక్ లలో చాలా లావిష్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. రవితేజ సూపర్ పెర్ఫార్మెన్స్, హరీష్ శంకర్ టేకింగ్, తమన్ మ్యూజిక్, రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫి ఈ చిత్రానికి హైలైట్స్ అవుతాయి. మిరపకాయ్ టైటిల్ కి తగినట్టుగానే రవితేజ క్యారెక్టర్ వుంటుంది. సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అవుతాయి. బ్యాంకాక్ లో చేసిన క్లైమాక్స్ చాలా థ్రిల్లింగ్ గా వుంటుంది.

రవితేజకు జంటగా 'లీడర్" ఫేమ్ రిచా గంగోపాధ్యాయ, వేదం ఫేమ్ దీక్షా సేథ్ నటిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకుంటున్నాయి. డిసెంబర్ 5న ఆడియో విడుదల చేసి, డిసెంబర్ 23న సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత భావిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలో రూపొందిన 'మిరపకాయ్' ఈ సంవత్సరం సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి గా నిలుస్తుంది' దర్శక నిర్మాతలు అంటున్నారు. వెంకటేష్ నటిస్తున్న 'నాగవల్లి", నాగార్జున నటిస్తున్న 'రగడ" చిత్రాలు కూడా డిసెంబర్ లోగా విడుదలయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటుండడం తెలిసిందే. ఈ ఇద్దరు పెద్ద హీరోలతో తలపడడం ద్వారా తాను కూడా పెద్ద మీరోనే అని నిరూపించుకోవాలనుకుంటున్న రవితేజ ఆశ అత్యాశగా మారుతుందా లేక నెరవేరుతుందా అన్నది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X