ధన్‌రాజ్ రమ్మని పిలిచాడు.. నేను వెళ్లలేదు.. అందుకే.. దీక్షా తీవ్ర ఆరోపణలు

హీరోయిన్ దీక్షా పంత్ బిగ్ బాస్ రియాల్టి షో నుంచి గత వారం ఎలిమినేట్ అయింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన దీక్షా తాజాగా ప్రముఖ టెలివిజన్ చానెల్‌తో మాట్లాడింది. అయితే ఆ షో లో తాను గడిపిన ముధుర క్షణాలను ఓ టీవ

By Rajababu

Recommended Video

Bigg Boss : Dhanraj misbehaved With Me, Deeksha ధన్‌రాజ్ రమ్మని పిలిచాడు.. నేను వెళ్లలేదు

హీరోయిన్ దీక్షా పంత్ బిగ్ బాస్ రియాల్టి షో నుంచి గత వారం ఎలిమినేట్ అయింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన దీక్షా తాజాగా ప్రముఖ టెలివిజన్ చానెల్‌తో మాట్లాడింది. అయితే ఆ షో లో తాను గడిపిన ముధుర క్షణాలను ఓ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. అంతేకాకుండా తనతో చెడుగా ప్రవర్తించిన ధన్‌రాజ్, అర్చన్ తదితరుల గురించి తీవ్ర విమర్శలు చేసింది. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన సభ్యులందరూ అక్కడ తాము గడిపిన మధుర క్షణాల గురించి ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. వివాదాలకు తావివ్వకుండా ఆచీతూచీ జవాబిచ్చారు.

ధన్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు...

ధన్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు...

దీక్ష ధన్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. షోలో అతను తనతో మొదట నుంచి వ్యతిరేకంగా ఉంటటానికి బలమైన కారణం ఉందంటూ కుండబద్దలు కొట్టింది. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా దీక్ష మాట్లాడుతూ... బంతిపూల జానకి చిత్రం చేస్తున్న సమయంలో ధన్ రాజ్ ప్రవర్తన సరిగ్గా లేదు. అందుకే నేను బిగ్ బాస్ హౌస్ లోనూ అతడితో దూరంగానే ఉన్నాను.

నాకు చాలా బాధేసింది...

నాకు చాలా బాధేసింది...

ధన్‌రాజ్‌కు దూరంగా ఉన్న కారణంగానే బిగ్‌బాస్ షోలో అతను నాకు వ్యతిరేకంగా ఉన్నాడు. నా గురించి తెలియని వాళ్లు విమర్శిస్తే పర్లేదు. కానీ నా గురించి తెలిసిన ధన్ రాజ్ కూడా నన్ను విమర్శించడం నాకు చాలా బాధేసింది. నేనను హౌస్ లోకి వెళ్లిన ఫస్ట్ డే నుంచి అతను నాకు వ్యతిరేకంగా ఉండటం నాకు నచ్చలేదు.

చాలా సార్లు బయట కలుద్దామని ...

చాలా సార్లు బయట కలుద్దామని ...

‘నిజానికి ... మా ఇద్దరి మధ్య సినిమా వరకే మంచి రిలేషన్ ఉంది. బయట మేమిద్దరం ఎప్పుడూ కలవలేదు. ధన్ రాజ్ చాలా సార్లు బయట కలుద్దామని అడిగాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. నాకలా కలవడం ఇష్టం లేదు. బహుశా అదే మనుస్సులో పెట్టుకుని బిగ్ బాస్ హౌస్ లో ధన్ రాజ్ అలా ప్రవర్తించాడేమో అనిపించింది‘ అని చెప్పుకొచ్చింది. ఈ విధంగా దీక్ష చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.

ప్రాంక్ కాల్ ను గుర్తు పట్టిన దీక్షా...

ప్రాంక్ కాల్ ను గుర్తు పట్టిన దీక్షా...

టెలివిజన్ ఇంటర్వ్యూలో భాగంగా దీక్షకు మరో బిగ్ బాస్ ఎలిమినేటర్ ధన్ రాజ్ ప్రాంక్ కాల్ చేయగా వెంటనే గుర్తు పట్టింది. ఈ సందర్భంగా దీక్షకు తగు సూచనలు ఇచ్చారు. బిగ్ బాస్ అనేది ఓ ఆట. ఆట సెలబ్రీటిలను ఆడిస్తుంది. కనుక ఎవరిపై ద్వేషం పెంచుకోకు అని సూచించాడు. అందుకు సమాధానంగా నిజ జీవితంలో నీవు అలా ముందు ప్రవర్తించి... మిగతా వారికి చెప్పు అని కౌంటర్ ఇచ్చింది.

ఫోన్ లో రఫాడించింది....

ఫోన్ లో రఫాడించింది....

అందరికీ నీతులు చెప్పే నీవు బిగ్‌బాస్‌లో ఉచ్చ పోసుకొన్న విషయం బయట ఎలా చెబుతావు. అది తప్పు కాదా? అలాంటప్పడు నీవు నాకు నీతులు చెప్పడం సరికాదు అని ధన్‌రాజ్‌ను ఫోన్‌లో రఫాడించింది.

అలాంటి రూమర్లు వచ్చాయి...

అలాంటి రూమర్లు వచ్చాయి...

బిగ్ బాస్ కంటే స్టంట్, హీరో ప్రిన్స్ తో సమ్ థింగ్, సమ్ థింగ్ ఉందంటూ వచ్చిన ఆరోపణలను దీక్షా కొట్టివేసింది. తాను బిగ్ బాస్ హౌస్ కు వెళ్లక ముందు ప్రిన్స్ ఓ అమ్మాయిని పంపించమని అడగటం, తనతో ప్రిన్స్ చనువుగా ఉండటం వలన అలాంటి రూమర్లు వచ్చాయి అని దీక్షా చెప్పింది.

ఫెయిర్ గా ఆడుతున్నాడు...

ఫెయిర్ గా ఆడుతున్నాడు...

బిగ్ బాస్ విజేతగా ఆదర్స్ లేదా శివ బాలాజీ గెలిచే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆదర్శ్ ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు అని పేర్కొంది. శివ బాలాజీ కూడా చక్కగా ఆడుతున్నాడు. తనకు శివతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అయితే చివర్లో కొంత విభేదాలు వచ్చాయి అని దీక్షా చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X