twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పల్లెటూరు పిల్లగా, సోలో హీరోయిన్ పాత్రలో...దీక్షాసేధ్

    By Srikanya
    |

    వేదం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దీక్షాసేథ్..నిన్న మిరపకాయ, రేపు వాంటెడ్ అంటూ దూసుకుపోతోంది. ఆమె గోపీచంద్ సరసన చేసిన వాంటెడ్ చిత్రంలో పాత్ర గురించి మాట్లాడుతూ "ఇందులో పల్లెటూరి పిల్లగా నటించాను. సోలో హీరోయిన్‌గా పూర్తి స్థాయి చిత్రమిది" అని చెప్పింది. 'వాంటెడ్' చిత్రంని జనవరి 26వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రచయిత బీవీఎస్ రవి దర్శకునిగా పరిచయమవుతున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వెనిగళ్ల ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు.

    ఈ టైటిల్ విషయమై మాట్లాడుతూ...హీరోకి హీరోయిన్ వాండెట్. విలన్ కి హీరో వాంటెడ్. కాబట్టే స్క్రిప్టు ప్రకారం ఈ టైటిల్ యాప్ట్ అని తలిచాం అన్నారు ఇక దర్శకుడు బి.వియస్ రవి గతంలో కళ్యాణ రామ్ జయీభవ, విష్ణు వర్దన్ సలీం, ఝమ్మంది నాదం వంటి చిత్రాలకి కథ, మాటలు అందించారు. ఈ చిత్రంలో జయసుధ, చంద్రమోహన్, ప్రకాశ్‌ రాజ్, నాజర్, బెనర్జీ, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, షఫీ, ప్రధాన తారా గణం. కెమేరా: రసూల్ ఎల్లోర్, కూర్పు: శంకర్, కళ: వివేక్, ఎగ్జి క్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X