మెగా బ్రదర్స్ కాంపౌండ్ నుండి బయట పడ్డ బాధితురాలు...
తమ చిత్రాలతో నిర్మాతలు, బయ్యర్ల కొంప ముంచడమే కాకుండా తమతో నటించిన పాపానికి పలువురు హీరోయిన్లు కెరీర్ కూడా నాశనమైపోవడానికి కారణమయ్యారు మెగా హీరోలు. 'వరుడు"లో నటించిన భాను మెహ్రాకి మళ్లీ ఇంకో అవకాశమిచ్చే వాళ్లే కనిపించలేదు. 'పులి" తో జత కట్టిన నికీషా పటేల్ కి కనీసం చిన్న చిత్రాల్లో అయినా ఛాన్స్ రావట్లేదు. ఇక 'ఆరెంజ్"లో నటించిన షాజాన్"ని పట్టించుకునే వాళ్లే లేరు. ఆరంజ్ లో రామ్ చరణ్ సరసన నటించిన జెనీలియాకు సినిమా ఇస్తే పెద్ద వింతే అనుకోవచ్చు..ఇలా చెప్పుతూ పోతో చాలా మందే ఉన్నారు. ఇలా మెగా ఫ్యామిలీతో నటించిన హీరోయిన్ల సంఖ్య ఇప్పుడు బాధిత సంఘం ఏర్సాటు చేసుకునే లెవల్ కి ఎదిగిపోయింది.
అయితే మెగాబ్రదర్స్ మరియు అల్లు అర్జున్ పై కామెంట్స్ చాలానే వున్నాయి. వారితో సినిమా చేసిన నూతన కదానాయికలకు ఆ తర్వాత సరైన అవకాశాలు రావనేది ఆ కామెంట్ సారాంశం. అల్లు అర్జున్ కైతే వరస బెట్టి గంగోత్రి తో పరిచయమైన అదితి అగర్వాల్, ఆర్యతో పరిచయమైన అనురాధా మెహతా, బన్ని తో పరిచయమైన గౌరీ ముంజాల్, వరుడు తో పరిచయమైన భాను శ్రీ మెహ్రల కెరీర్ లే ఇందుకు నిదర్శనాలు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పై వున్న ఆ అపనిందను అర్జున్ తో 'వేదం" చిత్రంలో రోమాన్స్ చేసిన దీక్షాసేథ్ తొలిగించారు. ఎందుకంటె వేదం చిత్రంతో పరిచయమైన దీక్షాసేథ్ తర్వాత రవితేజ 'మిరపకాయ్" సినిమాతో చాన్స్ కొట్టేసి సినిమా సక్సెస్ తో మంచి మార్కులే కొట్టేస్తోంది. తర్వాత గోపీచంద్ సరసన నటిస్తోన్న సంగతి విదితమే. ఇలా వరుస విజయాలతో ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర కధానాయికగా ఎదుగుతున్నారు. చేతి నిండా సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా భాసిల్లుతున్నారు.


Click it and Unblock the Notifications











