For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లారెన్స్ కొట్టిన దెబ్బ నుంచి ఇప్పటికి కోలుకోలేదు

  By Srikanya
  |

  హైదరాబాద్ : చిన్నా,పెద్దా చిత్రాలతో ఒక్కొ అడుగు వేసుకుంటూ వెళ్తున్న దీక్షాసేథ్ కి లారెన్స్ పెద్ద దెబ్బే కొట్టాడు. అతని రెబెల్ చిత్రంలో డీ గ్లామర్ గా ముసలి గెటప్ లో చూపించి, తెలుగులో ఒక్క ఆఫరూ లేకుండా చేసేసాడు. పోని అతను తన సొంత సినిమాల్లో అయినా ఎంకరేజ్ చేస్తున్నాడా అంటే అదీ లేదు. దాంతో ఆమె బాలీవుడ్ లో ఓ చిన్న చిత్రం ఒప్పుకుని చేసుకుంటోంది. కరీనా కపూర్ కజిన్ ఆర్మాన్ జైన్ హీరోగా చేస్తున్న చిత్రంలో హీరోయిన్ చేస్తోంది. జూలై 4న విడుదల కాబోయే ఈ చిత్రంపైనే ఆశలన్నీ పెట్టుకుంది. రెబెల్ చేయకుండా ఉండి ఉంటే తెలుగులో ఖచ్చితంగా మరిన్ని ఆఫర్స్ వచ్చేవి అంటున్నారు సినీ జనం.

  దీక్షాసేథ్ ఇప్పుడు తన గతం గుర్తు చేసుకుంటోంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ... క్షణం తీరిక దొరికినా.. పుస్తకాలతో దర్శనమిచ్చే దీక్షకు ఇంట్లోనే ఓ చిన్న గ్రంథాలయం ఉందట. ''వేదం సినిమాలో నటిస్తున్నప్పుడు ఒక చేతిలో డైలాగు పేపర్‌, మరో చేతిలో పుస్తకం ఉండేది. నా వాలకం చూసి బన్నీ తెగ ఏడిపించేవాడు. 'ఏంటిది ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌కి వెళ్లే పిల్లలా..' అనేవాడు. ఇప్పటికీ అలానే పిలుస్తున్నాడు. చదువుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. కామర్స్‌లో డిగ్రీ చేద్దాం అనుకొన్నాను. ముంబైలో ఒక యేడాది చదివాను. ఆ తరవాత సినిమాల్లోకి రావడంతో.. కాలేజీకి వెళ్లే అవకాశం లేకుండాపోయింది. కానీ ఏ మాత్రం సమయం దొరికినా అక్కడికి వెళ్తుంటా. అదో సరదా'' అని చెప్పింది.

  Deeksha Seth Hindi film on release July, 4th

  అలాగే... '' ఎవరి అడుగు జాడల్లోనో ఎందుకు నడవాలి? మనమే కొత్తగా ఓ మార్గం వెతుకుదాం మంచో చెడో ఆ దారిలోనే పయనిద్దాం అంటోంది దీక్షాసేథ్‌. తొలి దశలో ఎవరికైనా ఈ తరహా పాత్రలే దక్కుతాయి. అనుష్కకీ 'అరుంధతి'లాంటి కథ దొరకడానికి కొంత సమయం పట్టింది. అంతెందుకు? కరీనా కపూర్‌కి కూడా 'జబ్‌ వుట్‌ మెట్‌' సినిమాకి ముందు సాధారణ పాత్రలే దక్కాయి. ముందు దర్శకుడు హీరోయిన్ ని నమ్మాలి. ఈ పాత్ర చేయగలదు' అనే విశ్వాసం ఆయనకు కలగాలి. అప్పుడే నటించే అవకాశం మాకూ దక్కుతుంది. నేను ఎలాంటి పాత్రకైనా న్యాయం చేస్తాను. ప్రస్తుతానికి కథకేం కావాలో అదే చేస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చింది దీక్షాసేధ్.

  మొదట్నుంచీ యాక్షన్ సినిమాలంటే ఇష్టం. కత్తి పట్టుకుని యుద్ధం చేయాలంటే ఇంకా ఇష్టం. అలాంటి పాత్ర ఎవరైనా ఆఫర్ చేస్తే... రిస్కీ స్టంట్స్ చేయడానికి కూడా నేను వెనుకాడను. లైఫ్‌లాంగ్ నిలిచిపోయే అరుంధతి లాంటి పాత్రను చేయాలని ఉంది. నా కల నిజమయ్యే రోజులు త్వరలోనే ఉన్నాయ్ అని చెప్పుకొచ్చింది. తెలుగులో ప్రభాస్‌ సరసన రెబల్ లోను, రవితేజకు జోడీగా నిప్పు చిత్రంలోను, మంచు మనోజ్ చిత్రం ఊ కొడతారా ఉలిక్కి పడతారా లోనూ, గోపీచంద్ సరసన వాంటెడ్ లో చేసింది. అయితే ఆ సినిమాలేమీ ఆడలేదు.

  English summary
  
 Deeksha Seth who couldn't get offers after her ‘Rebel’ with Prabhas went to Bollywood where she starred in a film titled ‘Lekar Ham Deevana Dil’.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X