అల్లు అర్జున్ ‘హనీ’లో మిరపకాయ్ హీరోయిన్ ...!
అల్లు అర్జున్, ఇలియానా జంటగా త్రివిక్రమ్ కాంబినేషన్ లో త్వరలో సినిమా రానుంది. ఈ సినిమాని యూనివర్సల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'హానీ' అనే టైటిల్ తో పాటు 'హి ఈజ్ వేరి స్వీట్' అనే క్యాప్షన్ పెట్టనున్నారు. ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్ 7వ తేది నుండి పారంభం కానున్నది. బన్ని తన భార్యతో కలిసి పర్సనల్ ట్రిప్ కి వెళ్ళాడని, వచ్చే నెల తొలివారంలో వస్తాడని సమాచారం. ఇలియానా కూడా సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ లో పాల్గొననుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
కాగా తాజా అందిన సమాచారం ప్రకారం అల్లు అర్జున్ హనీ లో ఓ ఐటెం సాంగ్‌చేయడానికి దీక్షాసేథ్ ఓకే చెప్పిందిని సమాచారం. దీక్షా ఐటమ్ సాంగ్ చేస్తే సినిమాకు అదనపు ఆకర్షణ గా ఉంటుందని భావించిన త్రివిక్రమ్ ఆమెతో ఐటమ్ సాంగ్ చేయించేదుకు మాట్లాడి ఒప్పించాడని తెలుస్తోంది. ఇక దీక్ష ఇంతకు మందే అల్లు అర్జున్ సరసన వేదం సినిమాలో నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











