అల్లు అర్జున్ హీరోయిన్..గోపీచంద్ సరసన
క్రిష్ 'వేదం' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన దీక్షాసేధ్ తాజాగా గోపీచంద్ సరసన ఓ చిత్రం కమిటయింది. ఆ చిత్రంలో ఆమె అల్లు అర్జున్ ప్రేమించే డబ్బున్న అమ్మాయిగా చేసింది కానీ పెద్దగా ఆఫర్స్ రాలేదు. అయితే రచయిత నుంచి దర్శకుడుగా మారుతున్న బి.వి.యస్ రవి ఈమెను సెలెక్ట్ చేసారు. అతని దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ రూపొందించుతున్న చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేయనుంది. భవ్య క్రియేషన్స్ గతంలో గోపీచంద్ తో శౌర్యం చిత్రం చేసారు. ఈ చిత్రం ఆగస్టు 12న ప్రారంభంకానుంది. రసూల్ ఎల్లోర్ కెమెరా, చక్రి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఓ కీలకమైన పాత్రను చేయనున్నారు. ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక గోపీచంద్...ప్రముఖ దర్సకుడు బి.గోపాల్ చేస్తారనుకున్న ప్రాజెక్టు ఆగిపోయింది. అలాగే దీక్షా సేధ్ మిస్ ఇండియా-2009(ఫాంటలూమ్స్ ఫెమీనాప్రెష్ పేస్)గా ఎంపికైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











