దీక్షాసేథ్ నెలకో హీరోతో..?
వేదం సినిమా ద్వారా తెలుగు తెరకు రిచయమైన భామ దీక్షా సేథ్. తొలి సినిమాతోనే హాట్ హాట్ గా కనిపించి, తన క్యూట్ అప్పియరెన్స్ తో మంచి మార్కేలే కొట్టేసింది ఈ భామ. ఆ తర్వాత రవితేజ సరసన మిరపకాయ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా, అనంతరం గోపీచంద్ సరసన వాంటెడ్ సినిమాలో లీడ్ హీరోయిన్ గా చేసినా పెద్దగా పేరు రాలేదు ఈ హీరోయిన్ కి. అయితే సినిమా అవకాశాలు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం దీక్ష సేథ్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ సరసన రెబల్ చిత్రంలో, రవితేజతో నిప్పు, మనోజ్ తో ఊ కొడతారా ఉలిక్కి పడతారా, తమిళ హీరో విక్రమ్ తో రాజపొట్టయ్, శింబుతో వేటైమన్నన్ చిత్రాల్లో నటిస్తోంది.
వీటిలో ఒక సినిమా ఇదే సంవత్సరం విడుదలవుతుండగా..మిగిలిన నాలుగు సినిమాలు వచ్చే ఏడాది వరుసగా నెలకొకటి చొప్పున విడుదల కాబోతున్నాయి. అంటే దీక్ష వచ్చే సంవత్సరం నెలకో హీరోతో ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్నమాట. ఈ సినిమాల్లో కనీసం రెండు మూడు సినిమాలు భారీ విజయం సాధిస్తే దక్షిణాదిన తన సినీ కోరియర్ కు ఎలాంటి ఢోకా ఉండదని, ఇక్కడ టాప్ హీరోయిన్ గా ఎదిగి బాలీవుడ్ బాట పట్టాలని అమ్మడు ఆలోచనట. మరి దీక్ష కోరిక ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











