అందుకే వచ్చిన ప్రతీ ఆఫర్ ఒప్పుకుంటున్నా.. దీక్షాసేధ్
"అంతా అయిపోయాక అలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయాల్సింది అని బాధపడకుండా టైమ్ ఉన్నప్పుడే అనుకున్నవన్నీ చెయ్యాలి. అందుకే వచ్చిన ఆఫర్స్ ని ఒప్పుకుంటూ, అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్థున్నా'' అని ఆమె తేల్చి చెప్పింది దీక్షాసేధ్. వేదం చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ప్రభాస్ సరసన 'రెబల్'లో, రవితేజ సరసన 'నిప్పు'లో చేస్తోంది.
తనకు నిజాయితీ పనిచేయటం తప్ప చెప్పుకోవటానికి పెద్ద పెద్ద లక్ష్యాలంటూ ఏమీ లేవంటోంది. తాను మాధురీ దీక్షిత్ ఫ్యాన్ ని అని,ఆమెలా పేరు తెచ్చుకోవాలని అంటోంది. ఇక రెండేళ్ల క్రితం జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీలో పాల్గొనడం ఓ మర్చిపోలేని అనుభవం అనీ అదే తన జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్తోంది.


Click it and Unblock the Notifications











