నేను తప్పు చేస్తే...నాతో పాటు వాళ్లు కూడా: దీక్షా సేథ్
వాళ్లు కరెక్ట్‌గా చేసినా నేను తప్పు చేస్తే... నాతో పాటు వాళ్లు కూడా మళ్లీ మళ్లీ నటించాల్సి ఉంటుంది. అందుకే కాంబినేషన్ సీన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త పడతా అంటోంది దీక్షా సేధ్. వేదం చిత్రంతో పరిచయమై మిరపకాయ, వాంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ తన సినీ కెరీర్ ప్రారంభం రోజులు గుర్తు చేసుకుంటూ ఇలా స్పందించింది. ఆమె మాటల్లోనే..నా తొలి సినిమా పరిచయం చాలా గమ్మత్తుగా, కాకతాళీయంగా జరిగింది. మొదటి సినిమా చేస్తున్నప్పుడు అంతా విచిత్రంగా అనిపించింది. సినిమా అంటే తెర మీద చూసినంత ఈజీ కాదని తెలుసుకున్నాను. ఒక సీన్ చేసేటప్పుడు నేను పొరపాటు చేస్తే.. సహ నటీనటులకు ఇబ్బంది అవుతుంది అంది. ప్రస్తుతం దీక్షా చేతిలో తెలుగు, తమిళ్‌తో కలిపి దాదాపు ఐదు సినిమాలు ఉన్నాయి. అలాగే మంచు మనోజ్ సరసన ఆమె ఊ కొడతారా..ఉలిక్కి పడతారా చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











