తన ప్రేమ వ్యవహారాలుపై దీక్షాసేధ్ స్పందన
నేను ఇప్పటికే చాలా ప్రేమ లేఖలు అందుకున్నాను. అలాగే ఇప్పటికీ ప్రేమిస్తున్నానంటూ వస్తూనే ఉన్నాయి. అవెన్ని అనేది గుర్తు లేదు కానీ చాలా వచ్చాయి అని చెప్పగలను అంటోంది దీక్షాసేధ్. వేదం, మిరపకాయ, వాంటెడ్ చిత్రాల్లో నటించిన ఈ భామ తెలుగులో కంటిన్యూగా సినిమాలు ఒప్పుకుంటోంది. రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ మీరు ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా అన్న ప్రశ్నకు ఇలా జవాబిచ్చింది. అలాగే భవిష్యత్ లో ప్రేమలో పడే అవకాశమూ ఉందని చెప్తూ...ప్రేమ ఓ గొప్ప ఫీలింగ్. అది ఎప్పుడో ఎక్కడో ఒకర్ని చూసినప్పుడు మాత్రమే కలుగుతుంది. ఇప్పటివరకూ నన్ను ప్రేమలో పడేసేంత మగాడు మాత్రం తగలలేదు. అలాంటి వ్యక్తి భవిష్యత్తులో నాకు నచ్చిన వ్యక్తి ఎదురైతే అప్పుడు ఆలోచిస్తాను అంది.


Click it and Unblock the Notifications