హాట్ అండ్ స్పైసీ మిర్చి పోరితో చిట్ చాట్....!?

By Sindhu

'వేదం, మిరపకాయ్, వాంటెడ్" చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ ముద్దుబొద్దుగుమ్మ దీక్షాసేథ్. అటు తమిళం, ఇటు తెలుగు భాసా చిత్రాలతో దూసుకెళుతోంది. ప్రస్తుతం 'నిప్పు, ఊకొడతారా! ఉలిక్కిపడతారా! చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలోనూ పెద్ద పెద్ద హీరోల సరసన నటిస్తోంది. ఈ సందర్భంగా దీక్షా సేథ్ తో చిట్ చాట్ ఏమిటంటే

ఒకే ఒక విజయంతో రాకెట్ వేగంతో దూసుకెళ్ళిపోవాలనే ఆశలేదు. దేనికైనా కొంచెం సమయం పడుతుంది. 'వేదం" మంచి సినిమా. ఫలితం ఆశించినంతగా లేకపోయినా..అందరికీ తృప్తినిచ్చింది. ఇక వాంటెండ్" సంగతులంటారా..కమర్షియల్ హంగులు కాస్త ఎక్కువయ్యాయి. అయినా నాకు అవకాశాలు సరిపోయినన్ని లబించాయి. ప్రస్తుతం రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఇంకా కొత్త కథలు వింటున్నా అన్నారు.

రవితేజ నిప్పు సినిమాలో నా పాత్రలో గ్లామర్ పాళ్ళు కాస్త ఎక్కువే. మంచు మనోజ్ తో చేస్తున్న సినిమాలో చాలా తమాషా అయిన రోల్ ఉంది. ఏదో ప్రతి సినిమాలోనూ ఓ హీరోయిన్ కావాలి కదా అన్నట్టుండదు. కథలో కీలకమైనది చాలా ఇంట్రస్ట్ గా ఉంటుంది.

చిరంజీవి 150వ సినిమాలో నటించాలని ఉంది. అయితే అలాంటి అవకాశం దొరకదు. మనం ఎన్నో అనుకుంటాం అన్నీ జరగవుకదా అని నిరశా చెందింది. చిరు సినిమాలో ప్రత్యేక గీతమైనా సరే...ఆనందంగా ఒప్పుకుంటా. ఇప్పుడున్న యువ హీరోలలో నటించాలని ఉంది. అంతే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగాలంటే..హీరోయిన్ గా కొన్ని పాటించాలి. గ్లామర్ మెయింటేన్ చేయాలి.

తమిళంలో అయితే అక్కడి వారికి ముద్దుగా, బొద్దుగా ఉంటేనా చాలా ఇష్టపడతారు.. అవకాశాలు అవస్తాయంటూ..ప్రేక్షకులతో అనుసంధానమయ్యే కార్యక్రమాలంటే చాలా ఇష్టం. పరస్పర ఆలోచనల్ని పంచుకొనే వీలు చిక్కుతుంది. మాక్కూడా కాస్త కొత్తగా ఉంటుంది. అందుకే ఇలాంటి కార్యక్రమాలకు హజరవుతా..ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన పరాయి నటిని అనిపించుకోకూడదు. పదేళ్లయినా ఇక్కడే నిలవాలి. పట్టున్న పాత్రలు చేయాలి.ఇవే నేను కోరుకుంటున్నది..అని తన మనస్సులోని భావాలను తెలిజేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X