వెండితెరపై సన్నిలియోన్ బయోగ్రఫీ

By Srikanya

ముంబై: ఫోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్‌గా మారిన సన్నీ లియోన్ గురించి కొత్త గా పరిచయం అక్కర్లేదు. ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో క్రమక్రమంగా తన అందాలను విస్తరింప చేస్తున్న సన్నీ....ఇప్పటికే పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా వుంది. ఆమె జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ డాక్యుమెంటరీ రూపొందనుంది. బాలీవుడ్ దర్శకురాలు దీపా మోహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిలీప్ మోహతా దర్శకత్వం వహించనున్నారు.

పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్‌లో నటిగా సన్నిలియోన్ ప్రస్థానాన్ని ఈ చిత్రంలో చూపిస్తారని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి సన్నిలియోన్ భర్త వెబర్ మాట్లాడుతూ 'సన్నీ జీవితంపై సినిమా వస్తుందన్నది నిజమే. దానికి సంబంధించి ఓ కెనడియన్ నిర్మాణ సంస్ధ, దిలీప్ మోహతాలు మమ్మల్ని కలిసారు. దీనికి సంబంధించిన ఇతర విషయాలను త్వరలోనే వెల్లడిస్తాం 'అన్నారు.

'జిస్మ్‌-2'తో బాలీవుడ్‌కి పరిచయం అయిన కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ . ఈమె అమెరికాలో నీలి చిత్రాల్లో నటించింది. పూజా భట్‌ దర్శకత్వంలో రూపొందిన 'జిస్మ్‌-2'తో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో ఆమె చుట్టూ దర్శక,నిర్మాతలు తిరగటం మొదలెట్టారు. అయితే ఆమె ఆచితూచి అడుగులు వేస్తోంది. రామ్ గోపాల్ వర్మ వంటి దర్సకుడుకి సైతం డేట్స్ ఇవ్వని ఆమె ఈ చిత్రంలో నటించటంతో అంతటా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సన్నీ లియోన్ 'రాగిణి ఎమ్.ఎమ్.ఎస్ 2' 'జాక్‌పాట్' తదితర సినిమాల్లో నటిస్తోంది.

ఇక సన్నిలియోన్ సినిమాలో నటిస్తోందంటే ఓ వర్గం ప్రేక్షకులకు ఆ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోకపోతే ఆ సినిమా ఫలితం దారుణంగా ఉంటుందని గతంలో నిరూపించాయి. అయితే తాజాగా ఆమె నటించిన చిత్రం టీజర్ కూడా తమను అసంతృప్తికి గురి చేసిందని అభిమానులు కంప్లైంట్ చేస్తున్నారు. ఆమె సినిమాకు వెళ్లేదే... తెర నిండా 'అందాల ఆరబోత'కు, శృంగార దృశ్యాలకు లోటుండదని. అలా ఆశించిన వీరాభిమానులకు అనుకోని నిరాశే ఎదురైంది.

తాజాగా విడుదలైన 'రాగిణి ఎంఎంఎస్ 2' ట్రైలర్ చూశాక సన్నీ అభిమానులు నిజంగానే కంగుతిన్నారు. సన్నీ లియోన్ 'ఇంత దారుణం'గా తమను అసంతృప్తికి గురి చేస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆమె అభిమానులు తిట్టుకుంటున్నారు. స్నానం చేయడం.. ఆ తర్వాత ఆత్మలా మారడం.. అంతా చీకట్లో చిత్రీకరించినట్లు ఉందని, ఎలాంటి 'హాట్ సీన్స్ 'కు అవకాశం లేకుండా ఆమె నటించడంతో 'ట్రైలర్'ను చూసి అభిమానులు నీరసపడ్డారు. చీకట్లో ఆమె కనుమరుగవుతుండగా- 'ఆత్మ దెబ్బ రుచి చూడాలని ఉందా..?'- అని ట్రైలర్ చివర్లో ఓ వాక్యం ప్రత్యక్షం కావడంతో అభిమానులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X