ఆమె నా భార్యే కాదు.. మొదటి భర్త నుంచి విడాకులు పొందలేదు..

By Rajababu

సీనియర్ నటుడు దీపక్ తిజోరి తన భార్యపై వాఖ్యలు చేయడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. తమ 22 ఏండ్ల దాంపత్య జీవితాన్ని తప్పుపడుతూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన దీపక్‌పై భార్య శివానీ మండపడుతున్నారు. ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో భార్యభర్తల మధ్య సంబంధాలు బెడిసి కొడుతున్న నేపథ్యంలో తాజాగా దీపక్ తిజోరి దంపతుల వివాదం తెరపైకి రావడం సంచలనంగా మారింది.

భర్తతో విడాకులు పొందలేదు

భర్తతో విడాకులు పొందలేదు

శివానీతో నా పెళ్లికి చట్టబద్ధత లేదు. ఆమె మొదటి భర్త నుంచి విడాకులు పొందలేదు. అందుచేత తమ వైవాహిక జీవితానికి చట్టబద్దత లేదు అని దీపక్ తిజోరి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

హద్దు మీరి వ్యాఖ్యలు చేశాడు..

హద్దు మీరి వ్యాఖ్యలు చేశాడు..


దీపక్ తీరుతో ఆగ్రహం చెందిన శివానీ తీవ్రస్థాయిలో స్పందించింది. మా వివాహానికి చట్టబద్దత లేదని నా భర్త హద్దు మీరి వ్యాఖ్యలు చేశాడు. సభ్యత కూడిన విధంగా వ్యవహరించాలి అని శివానీ కౌంటర్ ఇచ్చింది.

నైతికతను మరిచాడు..

నైతికతను మరిచాడు..

దీపక్ తిజోరి 22 ఏండ్లుగా నాకు భర్త. యుక్త వయస్సులో ఉన్న ఇద్దరు యువతులకు తండ్రి. వైవాహిక జీవితంలో సున్నితత్వాన్ని, నైతికత, మర్యాదను మరిచి ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడలేను. ఈ వ్యవహారాన్ని కోర్టులే తేల్చుతాయి అని శివానీ అన్నారు.

భయపడాల్సిన అవసరం లేదు

భయపడాల్సిన అవసరం లేదు

మా పెళ్లి విషయంలో దాచాల్సిన అంశం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. వాస్తవాల ఆధారంగా కోర్టు నిజాలను వెల్లడిస్తుంది. సత్యమేదో కోర్టు బయటపెడుతుంది అని శివానీ అన్నారు. ప్రస్తుతం వీరిమధ్య వివాదానికి సంబంధించిన కేసు ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో దాఖలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X