ఎఫ్‌హెచ్‌ఎం మేగజైన్ కోసం దీపిక సెక్సీగా..(ఫోటోలు)
ముంబై : ఎఫ్‌హెచ్‌ఎం మేగజైన్ అనగానే బాలీవుడ్ హీరోయిన్లు హాట్ హాట్ గా, బట్టలు లేకుండా, సెక్సీ భంగిమలతో ఫోజులు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే వీణా మాలిక్, కాజల్ అగర్వాల్ లాంటి వాళ్లు నగ్నంగా, అర్ధ నగ్నంగా ఈ మేగజైన్ పై దర్శనం ఇచ్చారు. తాజాగా బాలీవుడ్ హాట్ లేడీ దీపిక పడుకొనె సెక్సీ ఫోజుతో అభిమానుల మతి పోగొడుతోంది.



ప్రస్తుతం దీపిక పడుకొనె రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న 'కొచ్చాడయాన్' చిత్రంలో నటిస్తోంది. ఈచిత్రంతో పాటు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్', సైఫ్ అలీ ఖాన్‌తో 'రేస్-2', రణబీర్ కపూర్‌తో 'యే జవానీ మై దివానీ', సంజయ్ లీలా బన్సాలీ దర్వకత్వంలో 'రామ్ లీల' ప్రాజెక్టులకు కమిట్ అయింది.
దీపిక రజనీకాంత్‌తో కలిసి నటిస్తున్న 'కొచ్చాడయాన్' సినిమా వివరాల్లోకి వెళితే...ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











