‘గబ్బర్‌సింగ్-2’ లో ఆఫర్ గురించి దీపిక పదుకోని
అలాగే ''ఒక నటిగా ఏదో ఒక భాషకు మాత్రమే పరిమితం కాను. మంచి కథ దొరికితే టాలీవుడ్.. శాండిల్‌వుడ్.. ఎక్కడైనా నటించడానికి సిద్ధమే'' అని చెప్పారు. ఇక హిందీ చిత్రం 'చెన్నై ఎక్స్‌ప్రెస్'లో లుంగీ కట్టుకోవడం గురించి చెబుతూ -''నేను పెరిగిందంతా బెంగళూరులోనే. అక్కడ తమిళులు ఎక్కువగా ఉండడంతో వాళ్ల వేషభాషలపై నాకు మంచి అవగాహన ఉంది. అందుకే లుంగీలో కనిపించడం అనేది పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు. కాకపోతే లుంగీలో నాకు నేనే చాలా డిఫరెంట్‌గా కనిపించా'' అన్నారు.
ఇదిలా ఉంటే 'చాందినీ బార్, పేజ్ 3, ఫ్యాషన్, హీరోయిన్' వంటి వైవిధ్యభరితమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన మధుర్ బండార్కర్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని దీపికా కొట్టేశారనే వార్త వచ్చింది. ఈ చిత్రానికి 'క్యాలెండర్ గాళ్' అనే టైటిల్‌ని ఎంపిక చేశారనే వార్త వచ్చింది. కానీ, ఈ వార్తను మధుర్ ఖండిస్తున్నారు. అసలు 'క్యాలెండర్ గాళ్' పేరుతో సినిమా చేసే ఉద్దేశమే లేనప్పుడు హీరోయిన్ ను ఎలా ఖరారు చేస్తానంటున్నారు మధుర్. ఒకవేళ ఈ టైటిల్‌తో రూపొందుతున్న చిత్రం కాకుండా వేరే సినిమాలో ఏమైనా దీపికాని ఎంపిక చేశారేమో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications












